సినిమాలో నా గతాన్ని చూపిస్తా.. అభిరామ్ కామెంట్స్!

దివంగత నిర్మాత రామానాయుడు మనవడు, సురేష్ బాబు కొడుకు, హీరో రానా తమ్ముడు అయిన అభిరామ్ చాలా కాలంగా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారు. కానీ అది డిలే అవుతూనే ఉంది. రీసెంట్ గా పుట్టినరోజు జరుపుకున్న అభిరామ్ మీడియాతో కొన్ని విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో జరిగిన ఓ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ పై అభిరామ్ ఓపెన్ అయ్యాడు. తాను తప్పు చేశానని.. కానీ తన తప్పుకి ఫ్యామిలీ మొత్తాన్ని బయటకి లాగడం కరెక్ట్ కాదని అన్నారు. తను ఒక హీరోగా మాత్రమే ఉండాలని కోరుకున్నట్లు.. రామానాయుడు మనవడ్ని, సురేష్ బాబు కొడుకనే ఇంపార్టెన్స్ వద్దని తెలిపారు.

తనకొక మంచి లవ్ స్టోరీ చేయాలనుందని.. ఆ లవ్ స్టోరీలో మంచి కంటెంట్ ఉన్న మెసేజ్ ఉండాలని అన్నారు. తను చేయబోయే సినిమాలో తన గతానికి సంబంధించిన విషయాలను చూపిస్తానని.. తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించిన ఇష్యూస్ కూడా చూపించబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తనకు జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌ బట్టి ఈ జెనరేషన్ కి ఓ సలహా ఇచ్చారు. దూకుడు వద్దని.. మనం చేసే తప్పు వలన ఫ్యామిలీకి చెడ్డ పేరు వస్తుందని అన్నారు.

తన జీవితంలో జరిగిన బ్లాక్ మెయిల్ అనేది చాలా మంది లైఫ్ లో జరుగుతుందని.. కొందరు బయటపడతారు, కొందరు బయటకి చెప్పరని అన్నారు. కోవిడ్ కి ఎలా భయపడుతున్నామో.. ఎదుటి వాళ్ల విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని.. నమ్మకం లేని చోట మరింత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అభిరామ్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. శ్రీరెడ్డి ఎఫెక్ట్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Share.