అలా అయితే.. రాజమౌళి పంట పండినట్లే

రాజమౌళి జీవిత లక్ష్యం ఏంటి అంటే… ‘మహాభారతం’ తెరకెక్కించడం అని అభిమానులు ఎవరైనా చెప్పేస్తారు. చాలా సందర్భాల్లో రాజమౌళి ఈ విషయం చెప్పుకొచ్చారు. అయితే దానికి ఇంకా సమయం ఉందని, ఇంకా సన్నద్ధం అవ్వాలని కూడా చెప్పాడు. అయితే ఈలోగా ఆమిర్‌ ఖాన్‌ ‘మహా భారతం’ తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు. ఆ తర్వా ఆ సినిమా కోసం టీమ్‌ని సిద్ధం చేసుకొని, అడ్వాన్స్‌లు కూడా ఇచ్చేశాడని వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా ఆలోచనను ఆమిర్‌ ఖాన్‌ విరమించుకున్నాడని తెలుస్తోంది.

‘మహాభారత్‌’సినిమాను ఐదు భాగాల్లో తెరకెక్కిస్తామని ఆమిర్‌ ఖాన్‌ చాలా రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం ఓ భారీ బడ్జెట్‌ సినిమాను కూడా వద్దనుకున్నాడని ఆ రోజుల్లో వార్తలొచ్చాయి. అంతగా ఇష్టపడిన సినిమాను… ఇప్పుడెందుకో వద్దనుకుంటున్నాడట. ప్రస్తుత పరిస్థితుల్లో అంత భారీ బడ్జెట్‌ వర్కౌట్‌ అవ్వదు అనుకున్నాడో, లేక అంత టైమ్‌ను స్పేర్‌ చేయలేం అనుకున్నాడో కానీ… సినిమా నుండి అయితే తప్పుకుంటున్నాడని వినికిడి. ఒకవేళ ఈ పుకార్లు నిజమై ‘మహాభారత్‌’ ఆలోచనను ఆమిర్‌ విరమించుకుంటే…

రాజమౌళి పంట పండినట్లే. ఎందుకంటే ఎప్పట్లా రాజమౌళి మళ్లీ తన ‘మహాభారత్‌’ ప్లాన్స్‌ మొదలెట్టొచ్చు. అంతేకాదు అభిమానులకు కూడా ఆనందమే. ‘మహాభారత్‌’ ఎక్కడ తీసినా మనం చూస్తాం కానీ.. రాజమౌళి తీస్తే ఆ మజానే వేరు కదా. సో రాజమౌళి గారూ… మీ నుండి ‘మహాభారత్‌’ అప్‌డేట్‌ కోసం వెయిటింగ్‌.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.