ఒక్క రూపాయికే విమానం టిక్కెట్!

కోలీవుడ్ స్టార్ హీరోసూర్య నటించిన లేటెస్ట్ సినిమా ‘శూరరై పోట్రు’. ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు. లేడీ డైరెక్టర్ సుధా కొంగర రూపొందిస్తోన్న ఈ సినిమాను సిఖ్య , 2డీ ఎంట‌ర్‌టైన్ మెంట్ పతాకంపై సూర్య స్వయంగా నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం నాడు చిత్రబృందం విడుదల చేసింది. డెక్కన్ ఎయిర్ లైన్స్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

అతి తక్కువ రేటుకి ప్రజలు విమాన ప్రయాణం చేసే విధంగా ఓ గ్రామానికి చెందిన యువకుడు కనే కలే ఈ సినిమా. కేవలం ఒక్క రూపాయికే విమానం టికెట్ లభించేలా ఓ విమాన సంస్థను స్థాపించాలనుకున్న సామాన్య వ్యక్తి.. ఈ క్రమంలోనే ఎదుర్కొన్న సవాళ్లను ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ ని బట్టి సినిమా ఎలా ఉంటుందో చెప్పేశారు. సూర్య చెప్పే డైలాగులు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి.

Aakaasam Nee Haddhu Ra Trailer Review1

కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో సూర్య ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ముందుగా అక్టోబర్ 30న ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు నవంబర్‌ 12కి వాయిదా వేశారు. దక్షిణాది నుండి ఓటీటీలో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదేనని చెప్పొచ్చు. ఈ సినిమాలో అపర్ణ బాలమురళి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు, జాకీష్రాఫ్, పరేష్ రావల్, ఊర్వశి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Share.