సందీప్ కిషన్ ‘ఎ1 ఎక్స్ ప్రెస్’ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం ‘ఎ1 ఎక్స్ ప్రెస్’.డెన్నిస్ జీవన్ కానుకొలను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ‘అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్’ ‘వెంకటాద్రి టాకీస్’ బ్యానర్ల పై టి.జి.విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం వంటి వారు కలిసి నిర్మించారు. హాకీ బాక్డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రానికి ‘ధృవ’ ఫేమ్ హిప్ అప్ తమిజా సంగీత దర్శకుడు. ‘సింగిల్ కింగులం’ అనే పాట సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఈ చిత్రం పై హైప్ కూడా ఏర్పడేలా చేసింది.

దాంతో ఈ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగింది. వాటి వివరాలను ఓసారి పరిశీలిస్తే :

నైజాం  1.60 cr
సీడెడ్  0.50 cr
ఉత్తరాంధ్ర  2.30 cr
ఏపీ+తెలంగాణ (టోటల్)  4.40 cr
రెస్ట్ ఆఫ్ ఇంఫియా  0.10 cr
 ఓవర్సీస్  0.10 cr
వరల్డ్ వైడ్ టోటల్  4.60 cr

‘ఎ1 ఎక్స్ ప్రెస్’ చిత్రానికి రూ.4.6 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 5కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో సందీప్ కిషన్ సినిమాలు పెద్దగా ఆడలేదు. పైగా పోటీగా చాలా సినిమాలు ఉన్నాయి. దాంతో పాజిటివ్ టాక్ రాకపోతే కనుక ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నెట్టుకు రావడం కష్టమైపోతుంది. చూడాలి మరి ఏమవుతుందో..!

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.