బిగ్ బాస్ 4: గేమ్ లో గేర్ మార్చారు..!

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ ఫినాలే వీక్ కి చేరుకున్నారు. నిజానికి టాప్ – 5 కి రావడం అనేది పార్టిసిపెంట్స్ ప్రతి ఒక్కరికీ కల. ఇక్కడ వరకూ వచ్చామ్ అంటేనే గేమ్ గెలిచినంత ఆనందపడతారు. అంతేకాదు, టాప్ – 5లోకి రావడానికి గేమ్ లో గేర్ మార్చుకుంటూ వస్తారు. ప్రతి శనివారం నాగార్జున వచ్చి ఇచ్చే ఇన్ పుట్స్ ని తీస్కుని వాటిపైనే గేమ్ మొత్తం ఆడాల్సి ఉంటుంది.

ఇలా గేమ్ పైన ఫోకస్ పెడుతూ టాస్క్ ల్లో బెస్ట్ ఫెర్పామెన్స్ ఇస్తే ఆడియన్స్ కి దగ్గరవుతారు. సరిగ్గా ఇదే చేశారు ఇప్పుడున్న టాప్ 5 మెంబర్స్ అందరూ కూడా. అయితే, లాస్ట్ వరకూ వచ్చేసరికి అరియానా తో లొల్లి పెట్టుకున్న సోహైల్ కాస్త డల్ అయ్యాడనే చెప్పాలి. అలాగే అరియానాకి కూడా ఈ ఇష్యూనే కీలకం అయ్యింది. వీరిద్దరూ చేసుకున్న యుద్ధం వాళ్లు ఓటింగ్ పైన ప్రభావాన్ని చూపించింది. ఆవారం బ్రతికి బయటపడ్డా కూడా తర్వాత వారం గ్రాండ్ ఫినాలే కావడంతో దాని ప్రభావం ఇంకా ఉందనే చెప్పాలి.

మరి దీని నుంచి బయటపడి లాస్ట్ డేస్ లో ఓటింగ్ లో పుంజుకుంటేనే తప్ప విన్నర్ కాలేరు. వీరితో పాటుగా మిగిలిన ముగ్గురికీ కూడా హ్యూజ్ గానే ఓట్లు వస్తున్నాయి. అన్ అఫీషియల్ పోల్స్ పక్కనబెడితే, యాప్ లో జరిగే ఓటింగ్, మిస్డ్ కాల్ డేటా అనేది ఎవరికీ తెలియదు. సో, ఈ ఐదుగురిలో ఎవరైనా కూడా విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇంకో మేటర్ ఏంటంటే, ఈసారి ఈ 5గురులో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే, ఎప్పటికప్పుడు వీళ్లు తమ గేమ్ లో గేర్లు మార్చుకుంటూ వెళ్లారు. తమ తప్పులని ఒప్పుకోవడానికి ఎక్కడా సంకోచించలేదు. అందుకే ఇప్పుడు సీజన్ 4 లో ఫినాలే రేస్ లో నిలబడ్డ ఈ టాప్ – 5 ఎంతో ప్రత్యేకం అని చెప్పొచ్చు. అదీ మేటర్.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.