అల్లు అర్జున్‌తో ఫొటో కోసం వీరాభిమాని ఏం చేశాడో తెలుసా?

అల్లు అర్జున్ అభిమానులందు, వీరాభిమానులందు పాత నాగేశ్వరరావు వేరు. అభిమాన కథానాయకుడితో ఫొటో దిగడం కోసం, అభిమాన కథానాయకుడిని నేరుగా కలవడం కోసం ఏకంగా 250 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఘనత అతడిది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో మెగాభిమానులలో, స్టయిలిష్ స్టార్ అభిమానులలో నాగేశ్వరరావు పాదయాత్ర హాట్ టాపిక్. అసలు, అతడు ఏం చేశాడు? అనే వివరాల్లోకి వెళితే…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో గల మాచర్ల మండలం, కమ్మపల్లి గ్రామానికి చెందిన పి. నాగేశ్వరరావుకి అల్లు అర్జున్ అంటే వీరాభిమానం. ‘గంగోత్రి’ సినిమా నుండి అభిమాని అట. అప్పటి నుండి ఇప్పటివరకు బన్నీని కలవాలని అతడి కోరిక. నాలుగైదుసార్లు ప్రయత్నించినప్పటికీ కుదరలేదనీ, అందుకే తన ఊరి నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేపట్టానని నాగేశ్వరరావు చెప్పుకొచ్చాడు.

Allu Arjun

ఈ పాదయాత్ర చూసి అయినా అల్లు అర్జున్ తనను కలవడానికి పిలుస్తారని నాగేశ్వరరావు ఆశిస్తున్నారు. సెప్టెంబర్ 17న మాచర్లలో అతడు బయలుదేరితే… సెప్టెంబర్ 22కి హైదరాబాద్ చేరుకున్నాడు. అల్లు అర్జున్ ను కలిసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాడు. ,మొత్తం మీద అటు ఇటుగా 250 కిలోమీటర్లు అతడు నడిచినట్టు వెల్లడించాడు. అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే… సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చేస్తున్నాడు.

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Share.