‘ఆర్.ఎక్స్.100’ హీరో మరో హిట్టు కొట్టేలా ఉన్నాడుగా

‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ యూత్ లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ‘ప్రేమతో మీ కార్తీక్’ అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతోనే మంచి గుర్తింపు తెచుకున్నాడు. ఆ తరువాత వచ్చిన ‘హిప్పీ’ చిత్రం ప్లాపైనా ఈ కుర్ర హీరో యాక్టింగ్ కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇటీవల విడుదలైన ‘గుణ 369’ కూడా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఇక ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ విలన్ గా చేసి మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ’90ml’ అంటూ మరో చిత్రంతో అలరించడానికి రెడీ అయ్యాడు.

90ml-movie-teaser-review1

శేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలైంది. ‘డీజిల్ తో నడిచే బండ్లని చూసుంటావ్… పెట్రోల్ తో నడిచే బండ్లని చూసుంటావ్.. ఇది లిక్కర్ తో నడిచే బండిని చూసుంటావ్’ అంటూ మాస్ డైలాగులతో… ఫైట్లతో దుమ్ము రేపేశాడు. ‘గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ అనే కుర్రాడు ‘ఆథరైజ్డ్‌ డ్రింకర్‌’గా పాపులర్‌ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటనేది ఈ చిత్రం కథాంశం అని టీజర్ చూస్తే తెలుస్తుంది. టీజర్ అయితే బాగుంది… మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

గద్దలకొండ గణేష్ (వాల్మీకి) సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.