ఆసక్తి రేపుతోన్న ’90 ఎం.ఎల్’ ట్రైలర్..!

హీరోకి ఏదో ఒక డిజార్డర్ ఉండటం ఎక్కువగా దర్శకుడు మారుతీ సినిమాల్లో చూస్తుంటాము. అయితే అంతకు ముందు నిఖిల్ ‘సూర్య వెర్సెస్ సూర్య’ సినిమాలో కూడా ఓ సారి చూసాం. ఇప్పుడు ఇలాంటి థీమ్ తోనే ‘ఆర్.ఎక్స్.100′ హీరో కార్తికేయ చిత్రం ”90 ఎం.ఎల్’ రూపొందినట్టు తెలుస్తుంది. నేహ సోలంకి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతమందించాడు. శేఖర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కార్తికేయ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించాడు.

90 ML Movie  Trailer Review

ఇప్పటికే విడుదల చేసిన టీజర్ తో ఈ చిత్రం పై మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు ట్రైలర్ విడుదల చేసి మరింత ఆసక్తిని పెంచారు. ‘కొందరికి మందు తాగడం సరదా.. మరి కొందరికి అది వ్యసనం.. బట్ మీ బాబుకు అది అవసరం’ అంటూ హీరో చిన్నప్పుడే తన తల్లిదండ్రులకి చెప్తాడు డాక్టర్. సో అలా ఉగ్గు కు బదులు పెగ్గులేసి హీరోని పెంచుతారు. ఇంటర్వ్యూ కు వెళ్తే అక్కడ ఇంటర్వ్యూ చేసే వారికి ఆథరైజ్డ్ డ్రింకర్ సర్టిఫికేట్ చూపిస్తాడు మన హీరో. ‘ఏ జన్మలో ఏ యాగం చేశారో రాజావారు.. ఈ జన్మలో ఈ యోగంతో పుట్టారు’ అంటూ హీరో గురించి తన తండ్రి చెప్పే డైలాగు ఆకట్టుకుంటుంది. తన ప్రేమ జీవితానికి కూడా తన డిజార్డర్ పెద్ద ప్రాబ్లెమ్ అవుతుంది. మరి చివరికి ఏమవుతుంది అనే క్యూరియాసిటీ తో సినిమా పై ఆసక్తి పెంచారు. ట్రైలర్ అయితే ఎంటర్టైనింగ్ గా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.