’30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?’ ట్రైలర్!

బుల్లితెరపై టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న ప్రదీప్ మాచిరాజు ఇప్పుడు హీరోగా పరిచయం కానున్నాడు. ప్రదీప్ ని హీరోగా పెట్టి దర్శకుడు మున్నా ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా..?’ అనే సినిమా తీశాడు. అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. గతేడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సివుంది. కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇన్నాళ్లకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జనవరి 29న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది. పవిత్రమైన ప్రేమ కథ ఒకటి కాగా.. ఈ జనరేషన్ కి తగ్గట్లుగా అల్లరి ప్రేమ వ్యవహారం రెండోది. ట్రైలర్ లో ఎక్కువగా ఈ జనరేషన్ కి చెందిన ప్రేమ కథనే చూపించారు. కాలేజీలో కొన్ని ఫన్ డైలాగులు, హీరో-హీరోయిన్ మధ్య గొడవలను ట్రైలర్ లో చూపించారు.

కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన కథకు ఫాంటసీను కూడా జోడించారు. ట్రైలర్ తో కొంతవరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రముఖ కన్నడ నిర్మాత ఎస్వీ బాబు సినిమాను నిర్మించారు.గీతా ఆర్ట్స్,యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాయి.

Share.