’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ క్లోజింగ్ కలెక్షన్స్..?

స్టార్ యాంకర్ ప్రదీప్.. హీరోగా మారుతూ చేసిన చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని సుకుమార్ శిష్యుడు మున్నా దూలిపుడి డైరెక్ట్ చేసాడు. ‘ఎస్వీ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్వీ.బాబు ఈ చిత్రాన్ని నిర్మించాడు.అనూప్ రూబెన్స్ సంగీతంలో రూపొందిన ‘నీలి నీలి ఆకాశం’ అనే ఒక్క పాట.. ఈ చిత్రానికి బోలెడంత క్రేజ్ ను తెచ్చిపెట్టింది. ఇక ‘జి.ఏ2.పిక్చర్స్’ ‘యూ.వీ. క్రియేషన్స్’ వంటి బడా నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చెయ్యడానికి ముందుకు రావడంతో … జనవరి 29న విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చినా కానీ.. అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. దాంతో 4 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. అయితే ఆ తరువాత నుండీ పెద్దగా రాణించలేకపోయింది.

ఇక ఫుల్ రన్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం :

నైజాం   2.16 cr
సీడెడ్   1.35 cr
ఉత్తరాంధ్ర   0.87 cr
ఈస్ట్   0.53 cr
వెస్ట్   0.42 cr
కృష్ణా   0.50 cr
గుంటూరు   0.59 cr
నెల్లూరు   0.29 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)   6.71 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   0.25 cr
ఓవర్సీస్   0.28 cr
వరల్డ్ వైడ్ (టోటల్)   7.24 cr

’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రానికి 4.5 కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా …ఆ టార్గెట్ ను 4 రోజుల్లోనే ఛేదించింది.ఇక ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 7.24 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా ఈ చిత్రం సూపర్ హిట్ లిస్ట్ లో స్థానం సంపాదించుకుంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.