24 కిస్సెస్

“కుమారి 21F” హిట్ తో సూపర్ స్టార్ అయిపోయిన హెబ్బా పటేల్ కు ఈమధ్యకాలంలో సరైన హిట్ లేదు. “ఏంజెల్” లాంటి డిజాస్టర్ అనంతరం కొంత గ్యాప్ తీసుకొని ఆమె నటించించిన చిత్రం “24 కిస్సెస్”. “మిణుగురులు” చిత్రంతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడంతోపాటు ఆ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ వరకూ తీసుకెళ్లిన అయోధ్యకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ లో విడుదలవ్వాల్సి ఉన్నప్పటికీ.. కారణాంతరాల వలన కొన్నాళ్లపాటు వాయిదాపడి నేడు (నవంబర్ 23) విడుదలైంది. మరి 23వ తారీఖున విడుదలైన ఈ 24 ముద్దుల కథ ప్రేక్షకులకు నచ్చుతుందో లేదో చూద్దాం..!! 24-kisses-4

కథ : మోడ్రన్ ఫాదర్ (నరేష్) ఇచ్చిన స్వేచ్చతో తనకిష్టమైన మాస్ కమ్యూనికేషన్స్ లో ఫిలిమ్ మేకింగ్ కోర్స్ చేస్తూ సరదాగా గడిపేస్తుంటుంది శ్రీలక్ష్మి (హెబ్బా పటేల్). ఫిలిమ్ మేకింగ్ గురించి గెస్ట్ లెక్చర్ తీసుకోవడానికి కాలేజ్ కి వచ్చిన చిల్డ్రన్ ఫిలిమ్ మేకర్ ఆనంద్ (అరుణ్ ఆదిత్)కు కారణం లేకుండానే ఆకర్షితురాలవుతుంది. తొలి పరిచయంలోనే ఒక స్నిఫ్ కిస్ (వాసన పీలుస్తూ ఇచ్చే ముద్దు) ఇస్తాడు ఆనంద్.. అలా మొదలైన ముద్దుల సంరంభం 13 ముద్దుల దగ్గర బ్రేక్ పడుతుంది. ఆనంద్ కి ప్రేమ-పెళ్లి వ్యవస్థపై నమ్మకం లేకపోవడంతో పెళ్లి వద్దు, ప్రేమ లేదు కానీ కలిసి ఉందాం, నాకు నువ్వు కావాలి అంటాడు.

ఈమధ్యలో ఆనంద్ అప్పుడప్పుడూ సైక్రియార్టిస్ట్ మూర్తి (రావు రమేష్) వద్దకు వెళ్తుంటాడు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇద్దరి నడుమ ముద్దులతో సంభాషణలు మొదలవుతాయి. మళ్ళీ 23 వద్దకి వచ్చి ఆగుతాయి. ఇంతకీ 24 కిస్సెస్ టైటిల్ జస్టీఫికేషన్ ఏమిటి? చివరికి ఆనంద్-శ్రీలక్ష్మీలు కలిశారా? పెళ్లి చేసుకొన్నారా? వంటి ప్రశ్నలకు సమాధానమే “24 కిస్సెస్” చిత్రం. 24-kisses-1

నటీనటుల పనితీరు : తనకు సినిమాల్లో నటించి ఎంతగా అలవాటైపోయినా.. మొదటిసారి మెద్దు పెడుతున్న, పెట్టించుకొంటున్న అమ్మాయిలో కనబడాల్సిన కంగారు కానీ, అలసట కానీ హెబ్బాలో కనిపించవు. అంతా యాంత్రికంగా చేసుకుంటూ పోతుంది. ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదు కానీ.. ఓవరాల్ గా శ్రీలక్ష్మీ అనే సాంప్రదాయబద్దమైన అమ్మాయి పాత్రకు హెబ్బా న్యాయం చేయలేకపోయింది.

కనిపించడానికి క్లారిటీ ఉన్నవాడిలా ఉన్నప్పటికీ.. బోలెడంత కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడే యువకుడి పాత్రలో అరుణ్ ఆదిత్ ఇమిడిపోయాడు. హెబ్బా కంటే అరుణ్ చాలా సన్నివేశాల్లో చక్కని అభినయం ప్రదర్శించాడు. అయితే.. అతడి క్యారెక్టరైజేషన్ లో క్లారిటీ లేకపోవడం వలన యూత్ ఆడియన్స్ మాత్రమే కాదు ఏ పర్టీక్యులర్ సెక్షన్ ఆఫ్ ఆడియన్ కూడా సినిమాకి కనెక్ట్ అవ్వలేడు.

రావు రమేష్ ఒక్కడే సినిమాలో కాస్తో కూస్తో నవ్వించాడు, ఆకట్టుకొన్నాడు. ఆయన మాటలు చాలా వరకూ ఆడియన్స్ మైండ్ సెట్ ను ప్రతిబింబించడం పుణ్యమా అని అప్పటివరకూ నీరసించి ఉన్న ఆడియన్స్ కు కాస్త రిలీఫ్ దొరికింది.

24-kisses-2

సాంకేతికవర్గం పనితీరు : “మిణుగురులు” లాంటి కళాత్మకమైన చిత్రం బాగుందని పేరొచ్చినా.. డబ్బులు రాలేదన్న కోపంతోనే లేక ఎలాగైనా తానూ గుర్తింపు తెచ్చుకోవాలన్న తపనతోనో “24 కిస్సెస్” కథను రాసుకొన్న దర్శకుడు అయోధ్యకుమార్ ఎంచుకొన్న పాయింట్ లోనే పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఒక నిబద్ధత కలిగిన యువకుడు పెళ్ళొద్దు.. లివ్ ఇన్ లో ఉందాం అనడం, కొన్ని లక్షల మందికి పిల్లలు సరైన ఆహారం లేక అనారోగ్యం పాలవుతున్నారనో, చనిపోతున్నారనే కారణంతో తాను పిల్లలు వద్దనుకోవడం అనే పాయింట్ వినడానికి బాగున్నా.. దాన్ని అంత కన్విన్సింగ్ గా తెరపై చూపలేకపోయాడు. సినిమాకి మెయిన్ యు.ఎస్.పి అయిన శ్రీలక్ష్మీ పాత్రను సరిగా డిజన్ చేసుకోలేదు.

అలాగే ఆ పాత్రకు తగ్గ నటనను హెబ్బా పటేల్ నుంచి రాబట్టుకోలేకపోయాడు అయోధ్య కుమార్. “మిణుగురులు” చిత్రంతో ఒక దర్శకుడిగా ప్రపంచాన్ని గెలిచిన అయోధ్యకుమార్ “24 కిస్సెస్” చిత్రంతో దర్శకుడిగానే కాక వ్యక్తిగానూ ఓడిపోయాడు. హీరో పాత్ర ఎంతసేపు హీరోయిన్ ను ఎమోషనల్ గా, ఫిజికల్ గా వినియోగించుకొంటున్నట్లుగా ఉంటుంది తప్ప.. ఆమె ఫీలింగ్స్ ను అర్ధం చేసుకొన్నట్లుగా ఎక్కడా కనిపించదు. పైగా.. ప్రెజంట్ జనరేషన్ యూత్ కి కనెక్ట్ అవుతుంది అనడంలో ఆయనకు నేటితరం ప్రేమల మీద ఉన్న ఐడియాలిజీ, అవగాహన స్పష్టమవుతోంది.

జోయ్ బారువా పాటలు బాగున్నాయి కానీ.. కొరియోగ్రఫీ ఆకట్టుకొనే స్థాయిలో లేదు. కెమెరా వర్క్ నిర్మాణ విలువలకు తగ్గట్లుగా ఉంది. ఆ నిర్మాణ విలువలు కూడా కథకి తగ్గట్లుగా ఉన్నాయి.24-kisses-3

విశ్లేషణ : టీజర్ లో రొమాన్స్, ట్రైలర్ లో ముద్దులు ఉన్నాయి కాబట్టి సినిమాలో అంతకుమించింది ఏదో ఉంటుంది అనుకోని థియేటర్ కి వెళ్తే మాత్రం తీవ్రంగా నిరాశ చెందక తప్పదు. ముద్దులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలియని వారికి తెలియజేయడం తప్ప ఏ రకంగానూ ఎంటర్ టైన్ కానీ ఎంగేజ్ కానీ చేయలేకపోయిన చిత్రం “24 కిస్సెస్”. 24-kisses-5

రేటింగ్ : 1/5

Share.