ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ వచ్చే సినిమాలివే!

మీకు నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ ఉందా… అయితే 2021 నెవర్‌ బిఫోర్‌, ఎవర్‌ ఆఫ్టర్‌లా ఉండబోతోంది. ఎందుకంటే మంచి జోరు మీదున్న నెట్‌ఫ్లిక్స్‌ ఈ ఏడాది రాబోయే సినిమాలు, షోలు, సిరీస్‌ల వివరాలు ప్రకటించేసింది. ఆ లైనప్‌ చూస్తుంటే… సినిమా అభిమానులకు పండగలా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఈ ఏడాది రాబోతున్న నెట్‌ఫ్లిక్స్‌ వినోదాల వరుసను చదివేయండి… ఆ తర్వాత టైమ్‌ వచ్చినప్పుడు చూసేయండి. ముందుగా సినిమాలు చూసుకుంటే… బుల్బుల్ తరంగ్ , ధమాకా , హసీన్ దిల్‌రూబా, జాదూగర్ , జగమే తందిరమ్, మీనాక్షీ సుందరేశ్వర్, మైల్‌స్టోన్‌, నవరస, పగ్‌లైట్, పెంట్ హౌస్, సర్దార్ కా గ్రాండ్‌సన్‌ , ది డిసైపిల్‌ (శిష్యుడు) ఈ ఏడాది నెట్‌ఫ్లిక్స్‌ నుండి రాబోతున్నాయి.

సినిమాల రేంజిలోనే సిరీస్‌లు వరుస కట్టబోతున్నాయి. అజీబ్ దాస్తాన్స్, బాంబే బేగమ్స్, డీకపుల్డ్, ఆరణ్యక్ , దిల్లీ క్రైమ్‌ 2, ఫీల్స్‌ లైక్‌ ఇష్క్‌, ఫైండింగ్‌ అనామిక , జమ్తారా – సబ్కా నంబర్ అయేగా 2, కోటా ఫ్యాక్టరీ 2, లిటిల్ థింగ్స్ 4, మాయూ, మసాబా మసాబా 2, మిస్‌ మ్యాచ్ 2, రాయ్‌, షీ 2, యే కాలీ కాలీ అంఖే ఈ ఏడాది వస్తాయి. కామెడీ ప్రీమియం లీగ్, కపిల్ శర్మ, సుముఖి సురేష్, ఆకాష్ గుప్తా, రాహుల్ దువా, ప్రశాస్తి సింగ్ నుంచి కామెడీ సిరీస్‌లు వస్తాయని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది.

ఇక డాక్యుమెంటరీల విషయానికొస్తే… ఇండియా డిటెక్టివ్స్, హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారి డెత్స్, ఇండియన్ ప్రిడేటర్, సెర్చింగ్‌ ఫర్‌ షీలా , రియాలిటీ సిరీస్, ఫాబ్యులెస్‌ లైవ్స్‌ ఆఫ్‌ బాలీవుడ్ వైవ్స్ 2, సోషల్ కరెన్సీ, బిగ్ డే కలెక్షన్ 2 ఈ ఏడాది వస్తాయి. అయితే ఇవి ఇప్పటివరకు అగ్రిమెంట్‌ ఓకే అయిన లిస్ట్‌. ఇవికాకుండా ఇంకా చాలా సినిమాలు, సిరీస్‌లు ఈ ఏడాది వస్తాయి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.