ఆ టాలీవుడ్ దర్శకుడిది పెర్ఫెక్షనా.. చాదస్తమా..!

అవును నిజమే..! తన సినిమాలో 20 సెకండ్ల పాటు కనిపించే ఓ పాత్ర కోసం..ఓ టాలీవుడ్ దర్శకుడు 200మందిని ఆడిషన్ చేసాడట. ఓ రోజంతా దీని కోసం అతను ఆడిషన్ నిర్వహించడం జరిగింది. ఆ 200 మంది కూడా ఉదయం నుండీ సాయంత్రం వరకు తిండి, నీళ్లు వంటివి లేకుండా గడిపారట. తీరా ఆడిషన్ ఇచ్చాక.. ఆ పాత్రకి ఎవరు ఎంపికయ్యారో కూడా తెలియని పరిస్థితి. ఆ 200 మందిని ఆడిషన్ చేయడానికి ఓ 10 మంది స్టాఫ్ రోజంతా తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది.

ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఆ చిత్రం నిర్మాతకి కూడా ఈ విషయం తెలీదట. ఓ ముఖ్య పాత్ర కోసం ఆడిషన్ కావాలంటున్నాడేమో అని స్టాఫ్ ను ఏర్పాటు చేసాడట. కానీ 20 కేవలం 20 సెకండ్ల పాటు కనిపించే పాత్రకి అంత హడావిడి ఎందుకు.. యూనిట్ సభ్యులలో ఎవరో ఒకర్ని పెట్టేస్తే సరిపోతుంది కదా అని నిర్మాత రియలైజ్ అయినట్టు తెలుస్తుంది. ఆ దర్శకుడు 9 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు తీసింది 4 సినిమాలే..!

అందులో ఒక సినిమా మాత్రమే హిట్టు. మిగిలినవి అన్నీ ఢమాలే. నిర్మాతలకి భారీ నష్టాలను మిగిల్చినవే. ప్రస్తుతం అతని 5వ సినిమా మలయాళం స్టార్ హీరోతో పాన్ ఇండియా మూవీగా చేస్తున్నాడు. ఆ మలయాళం స్టార్ హీరోకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. తెలుగులో అతనికి 3 హిట్ సినిమాలు ఉన్నాయి. ఆ హిట్లతో ఒకటి బయోపిక్ కావడం విశేషం.

Most Recommended Video

బిగ్‌ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!

Share.