బిగ్ బాస్ 4: బిగ్ బాస్ లవర్స్ ని ఆకట్టుకున్న 20 అంశాలు..!

బిగ్ బాస్ సీజన్ 4 అనేది అన్ని సీజన్స్ కంటే కూడా సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే, ఫేమస్ సెలబ్రిటీలు అంటూ ఎవ్వరూ లేకపోయినా కూడా షో ని రన్ చేశారు. అలాగే ఈ కరోనా సిట్యువేషన్ లో ఒక రియాలిటీ షోని చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. అయితే, ఈసారి సీజన్ అన్నింటికంటే కూడా బాగా పాపులర్ అయ్యిందనే చెప్పాలి. రేటింగ్ పరంగా ఎలా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ వచ్చింది.

ఈసీజన్ లో మనం ముఖ్యంగా కొన్ని హైలెట్స్ చూసినట్లయితే,

** గంగవ్వని తీసుకురావడం అనేది సాహసం అనే చెప్పాలి. ఈ వయసులో గంగవ్వ లాంటి పార్టిసిపెంట్ ని హౌస్ లోకి పంపించారు. ఏ సీజన్ లో కూడా ఏ లాంగ్వేజ్ లో కూడా ఇలాంటి పార్టిసిపెంట్ రాలేదు.

 

** రోబో టాస్క్ సీజన్ లోనే హైలెట్ అయ్యింది.

** ఈసారి డిజిటల్ అండ్ సోషల్ మీడియాలో ఫేమస్ సెలబ్రిటీలకి పెద్దపీట వేశారు. గంగవ్వ, మెహబూబ్, దేత్తడిహారిక, అరియానా గ్లోరీ లాంటి వాళ్లకి అవకాశం కల్పించారు.

** అమ్మరాజశేఖర్ గుండు చేయించుకోవడం సీజన్ కే హైలెట్.

** హారిక టాస్క్ కోసం హైయిర్ కట్ చేయించుకోవడం, 8సార్లు కెప్టెన్సీ పోటీదారుగా ఎంపిక అవ్వడం గ్రేట్.

** పులిహోర రాజా అనే డైలాగ్ బాగా ఈసారి వాడారు.

** మోనాల్ – అఖిల్ – అభిజీత్ మధ్యలో ట్రయాంగిల్ లవ్ స్టోరీలాగా ఆడియన్స్ కి ప్రజెంట్ చేయడం విశేషం.

** మోనాస్ ఏడుపు కూడా సీజన్ లో హైలెట్ అయ్యింది.

** మెహబూబ్ డ్యాన్స్, పోగొట్టుకున్న స్విచ్ క్వాయిన్ , పుచ్చపగిలిపోద్ది డైలాగ్ హైలెట్.

Stunning dance performance Harika and Mehaboob Dilse

** అవినాష్ జోకర్ గా చూపించిన AV, అలాగే అవినాష్ ఇచ్చిన ఎంటర్ టైన్మెంట్ చాలా బాగా ఆకట్టుకున్నాయి.

** అఖిల్ – అభిజీత్ ల మద్యలో జరిగిన నామినేషన్స్ వార్ కూడా బాగా పాపులర్ అయ్యింది. ముక్యంగా పులి – మేక కౌంటర్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి.

** నోయల్ లెగ్ పెయిన్ తో గేమ్ లో నుంచి తప్పుకోవడం, అలాగే తర్వాత స్టేజ్ పైన అవినాష్ ని, అమ్మరాజశేఖర్ ని నిలదీసి అడగడం అనేది హైలెట్ అయ్యింది.

** సమంత యాంకరింగ్, ఆది వేసిన పంచ్ లు, సుమ చమక్కులు ఎపిసోడ్ లో మెరిశాయి.

** అఖిల్ స్టేజ్ పైన అఖిల్ తో మాట్లాడటం, అలాగే సమంత కట్టినచీర ఆవారం ఎపిసోడ్ లో హైలెట్ అయ్యాయి.

** నాగార్జున మనాలీ నుంచి పార్టిసిపెంట్స్ కోసం తీసుకుని వచ్చిన స్వెట్టర్స్, హౌస్ లో అభిజీత్ – అఖిల్ బర్త్ డే సంబరాలు, మోనాల్ హగ్గులు, ముద్దులు హైలెట్ గా నిలిచాయి.

** సోహైల్ ఎనర్జీ – కార్ఖానా 9PM జోకులు, కథ వేరే ఉంటది అనే డైలాగ్ ఫేమస్ అయ్యింది.

** అరియానా బొమ్మ చింటుగాడు చాలా ఫేమస్ అయ్యాడు. వాడికోసం జరిగిన యుద్ధంతో సీజన్ మొత్తంలో లెక్కలు మారిపోయాయి.

** మోనాల్ – అఖిల్ మద్యలో ట్రాక్, సోహైల్ – మెహబూబ్ ఫ్రెండ్షిప్ బాండ్, సుజాత అల్లరి, గంగవ్వ పంచ్ లు, నోయల్ ర్యాప్ సాంగ్, కుమార్ సాయి కౌంటర్స్ ఇవన్నీ సీజన్ కి హైలెట్స్ అనే చెప్పాలి.

** లాస్య పప్పు, లాస్య కొడుకు జున్నుగాడు, అభిజీత్ మదర్ వేసిన పంచ్ లు, స్వాతి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ సీజన్ లో హైలెట్ అయ్యాయి.

** అవినాష్ పెళ్లి మేటర్, హారిక ఇచ్చిపారేయ్ డైలాగ్, అరియానా సీరియస్ లీ అనే ఊతపదం, అకిల్ సీక్రెట్ రూమ్, దెయ్యం జలజ కామెడీ వీటితో ఈ సీజన్ చాలా సరదాగా గడిచిపోయింది.

Share.