20 ఏళ్ళ ‘నువ్వే కావాలి’ గురించి మనకు తెలియని నిజాలు..!

కె.విజయ భాస్కర్ డైరెక్షన్లో ‘ఉషాకిరణ్ మూవీస్’ బ్యానర్ పై రామోజీ రావు, స్రవంతి రవి కిశోర్ కలిసి నిర్మించిన ‘నువ్వే కావాలి’ చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరుణ్,రిచా.. జంటగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పెద్ద హీరోల సినిమాలే ఎక్కువ థియేటర్లలో 100 రోజులు ఆడేవి. కానీ ‘నువ్వేకావాలి’ చిత్రం హీరో అయిన తరుణ్ కు ఇదే మొదటి చిత్రం.చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో అతను నటించినప్పటికీ.. హీరోగా ఇదే అతనికి మొదటి చిత్రం. హీరోయిన్ కూడా తెలుగు ప్రేక్షకులకు కొత్తే. ఇక డైరెక్టర్ కు కూడా రెండు సినిమాల అనుభవమే ఉంది. అయినా కూడా ‘నువ్వే కావాలి’ చిత్రం అప్పటి రోజుల్లోనే సంవత్సరం పైనే ఎక్కువ థియేటర్లలో ఆడిందంటే మామూలు విషయం కాదు.

ఈరోజుతో 20 ఏళ్ళు కావస్తున్న తరుణంలో.. ఈ చిత్రం గురించి మనకు తెలియని కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారు. ఒకరు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరొకరు అక్కినేని నాగేశ్వర రావు గారి మనవడు సుమంత్.మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘నిరమ్’ అనే చిత్రాన్ని చూసి.. అది నచ్చడంతో నిర్మాత స్రవంతి రవికిషోర్ గారు..మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో మార్పులు చేయించి బౌండ్ స్క్రిప్టు ను రెడీ చేయించుకున్నారు. ఆ తరువాత విజయ్ భాస్కర్ ను దర్శకుడిగా ఎంచుకున్నారు. అప్పటికే విజయ్ భాస్కర్ ‘స్వయంవరం’ అనే హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఆ చిత్రానికి కూడా త్రివిక్రమ్ రైటర్ గా పనిచేసాడు.స్రవంతి రవికిషోర్ గారు అప్పుడు ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతున్న నేపథ్యంలో రామోజీ రావు గారు ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు. విడుదల రోజున ఈ చిత్రానికి తక్కువ థియేటర్లే దక్కాయి.సూపర్ హిట్ టాక్ రావడంతో రెండో వారం నుండీ థియేటర్లను పెంచారట. కోటి సంగీతంలో రూపొందిన పాటలు ఈ చిత్రానికి బాగా ప్లస్ అయ్యాయని చెప్పొచ్చు. కేవలం రూ.1.3 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం అప్పటి రోజుల్లోనే 24 కోట్ల గ్రాస్ వసూళ్ళను రాబట్టి సంచలనాలు సృష్టించింది.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Share.