2019 లో ఎంట్రీ ఇచ్చి.. ఆకట్టుకున్న భామలు..!

ప్రతీ సంవత్సరం టాలీవుడ్ లో కొత్త భామలు ఎంట్రీ ఇస్తూనే ఉంటారు. అలా అని అందరూ ప్రేక్షకాకుల్ని ఆకట్టుకుంటారా అంటే.. కచ్చితంగా అవునని చెప్పలేం..! అయితే ఈ 2019 లో మాత్రం చాలా మంది కొత్త భామలు టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి.. ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. చాలా మంది యువకులకు క్రష్ గా మారిపోయారు. తమ నటన తో అన్ని వర్గాల ప్రేక్షకులతో మంచి మార్కులు వేయించుకుని.. మంచి క్రేజ్ ను దక్కించుకున్నారు. అలా ఆకట్టుకున్న భామలు ఎవరెవరో.. ఓ లుక్కేద్దాం రండి :

1) ప్రియాంక అరుళ్ మోహన్ : ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. అంతకు ముందు ఓ కన్నడ సినిమాలో కూడా నటించింది. కానీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రంతో అందరికీ క్రష్ గా మారిపోయింది. ఈమె తరువాతి సినిమా కోసం కూడా ప్రేక్షకులు ఎదురుచూసేలా చేసింది.

1Priyanka Arul Mohan

2) శ్రద్దా శ్రీనాథ్ : ఈ కన్నడ భామ కూడా నాని సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ‘జెర్సీ’ చిత్రంలో హీరో నాని కి ఎన్ని మార్కులు పడ్డాయో.. ఈ బ్యూటీకి కూడా సమానంగా మార్కులు పడ్డాయి. నిజానికి ఈమె ఆది సాయి కుమార్ హీరోగా రూపొందిన ‘జోడీ’ చిత్రంతో ఇంట్రొడ్యూస్ అవ్వాలి. కానీ ఆ చిత్రం షూటింగ్ లేట్ అవ్వడంతో.. ‘జెర్సీ’ తో ఎంట్రీ ఇచ్చింది.

4Shraddha Kapoor

3) దివ్యాంశ కౌశిక్ : ఈ ఏడాది నాగ చైతన్య, సమంత ల బ్లాక్ బస్టర్ చిత్రం ‘మజిలీ’ లో.. ఈమె ఓ హీరోయిన్ గా నటించింది.

4Shraddha Kapoor

4) శ్రద్దా కపూర్ : దాదాపు బాలీవుడ్ సినిమాలు చూసే వారందరికీ.. ఈమె సుపరిచితమే..! కానీ మన తెలుగులో మాత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘సాహో’ చిత్రంతో పరిచయమైంది.

4Shraddha Kapoor

5) జరీన్ ఖాన్ : గోపీచంద్ హీరోగా వచ్చిన ‘చాణక్య’ సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్, కత్రినా బ్రేకప్ అయిన టైములో.. ఓ సినిమాలో ఆమె డూప్ కోసం జరీన్ ఖాన్ ను తీసుకొచ్చారట.

5Zareen Khan

6) శృతి శర్మ : ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రంలో ఈమె ప్రధాన పాత్ర పోషించింది. అలా అని హీరో వెంటపడే హీరోయిన్ లా కాదు, కనీసం డ్యాన్స్ లు కూడా ఉండవు. హీరో ఈమెకు గురువు లాగా.. ఈమె హీరోకి శిష్యురాలిలా కనిపిస్తుంది. కానీ మంచి నటన కనపరిచింది.

6Shruti Sharma

7) సలోని మిశ్రా : విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘ఫలక్ నుమా దాస్’ లో నటించింది.

7Saloni Mishra

8) హర్షిత గౌర్ : ఈమె కూడా ‘ఫలక్ నుమా దాస్’ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. మంచి నటన తో ఆకట్టుకుంది.

8Harshita Gaur

9) అన్య సింగ్ : సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ‘నిను వీడని నీడను నేనే’ చిత్రంలో నటించి మెప్పించింది.

9Anya Singh

10) గార్గేయి యల్లాప్రగడ : ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంలో ఈమె నటన స్పెషల్ అట్రాక్షన్ అనే చెప్పాలి.

10Gargeyi Yellapragada

11) సుకృత వాగ్లే : ‘రామ చక్కని సీత’ అనే సినిమాలో ఈమె నటించి మెప్పించింది. ఈమె కన్నడ లో ఎక్కువ చిత్రాలు చేసింది.

11Sukrutha Wagle

12) సాషా చెట్రి : ఆది సాయికుమార్ హీరోగా వచ్చిన ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’ లో ఈమె నటించింది.

12Sasha Chettri

13) నేహా చౌహన్ : రవిబాబు ‘ఆవిరి’ చిత్రం ద్వారా పరిచయమైంది.

13Neha Chauhan

14) వాణి భోజన్ : విజయ్ దేవరకొండ నిర్మాత మారి రూపొందించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

14Vani Bhojan

15) అనన్య : ప్రియదర్శి హీరోగా వచ్చిన ‘మల్లేశం’ లో నటించింది. ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

15Ananya

Share.