ఈ సెలబ్రిటీలకు వచ్చిన జబ్బులు పేరు వినడానికే కొత్తగా ఉన్నాయి..!

ఆరోగ్యమే మహా భాగ్యం అంటుంటారు మన పెద్దలు. కానీ పనిలో పడి.. లేదా పని ఒత్తిడులకి గురయ్యి మనం సరైన సాయంలో ఆహరం తినకపోవడం వంటివి ఒక్కోసారి మన అనారోగ్యానికి కారణం అవుతుంటాయి. అంతేకాదు సరైన ఆహార లోపం వలన అస్వస్థకు గురవ్వడంతో పాటు కొత్త ‘ఎలర్జీస్’ కూడా ఏర్పడే అవకాశం ఉంటుందనడంలో సందేహం లేదు. అంతేకాదు మన పనిని… ఆరోగ్యానికి సంబందించిన జాగ్రత్తలు తీసుకోవడం కొంచెం కష్టమే అయినప్పటికీ.. ఫాలో అవ్వక తప్పదు. కొంతమంది సినీ ప్రముఖులు.. వెండితెర అందంగా మరియు బలంగా కనిపించడానికి చాలా వర్కౌట్లు చేస్తుంటారు. అంత మాత్రాన వారు నిజ జీవితంలో పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్టు కాదు. ఇలా నిజజీవితంలో అనారోగ్య సమస్యలతో బాధపడిన మరియు బాదపడుతున్న కొందరు సినీ ప్రముఖుల్ని చూద్దాం :

రజినీకాంత్

01-Rajinikanth

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ 2011 సంవత్సరం లో ‘ఎమెసిస్’ అనే సమస్యతో ఫైట్ చేసారు. దీంతో శ్వాస నాళముల వాపు చెందడంతో కొన్నాళ్ళు ‘ఐ.సి.యు’ లో కూడా జాయిన్ అయ్యారు. దీనికోసం సింగపూర్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని కోలుకున్నారు.

షారుఖ్ ఖాన్

02-shahrukh khan

బాలీవుడ్ బాద్ షారుఖ్ ఖాన్ కూడా చాలా కాలం ‘డిప్రెషన్’ లోకి వెళ్ళిపోయాడట. ఒక దశలో ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడట. అయితే నటన పై ఉన్న ప్రేమే తనని కోలుకునేలా చేసింది. కోట్ల మంది ఫ్యాన్స్ ని అలరించేలా చేస్తుంది. అదే అతని బలం. దీనితోనే తొందరగా కోలుకున్నాడు.

ఇలియానా

03-ileana

అప్పట్లో ఇలియానా కూడా ‘బాడీ డిస్ మార్ఫిక్ డిసార్డర్ ‘ కి గురయ్యిందట. ఒక దశలో ఇలియానా ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. తన బాడీ షేప్ పై కొందరు కామెంట్స్ చేయడంతో.. ఇలాంటి నిర్ణయానికి పడిపోయిందట. అయితే తనకు తనే ధైర్యం చెప్పుకుని ఈ సమస్య నుండీ బయట పడిందట. వైద్య నిపుణుల సందేశాలు క్రమంగా ఫాలో అయ్యేదట ఈ అమ్మడు. అలా తన డిసార్డర్ నుండీ బయటపడిందట.

సోనాలీ బింద్రే

04-sonali bendre

కొంత కాలంగా సోనాలి క్యాన్సర్ తో బాధపడిన సంగతి తెలిసిందే. చిక్కిత్స కోసం విదేశాలకు వెళ్ళి ఎంతో ధైర్యంగా క్యాన్సర్ ను ఎదుర్కొన్న సోనాలి మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టింది. న్యూయార్క్ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది. ఇక ఇటీవలే కోలుకుని.. ఎన్ని రోజులని రెస్ట్ తీసుకుంటానంటూ మళ్ళీ తన పనిని మొదలెట్టింది. చివరికి క్యాన్సర్ తో పోరాడి గెలిచింది.

ఇర్ఫాన్ ఖాన్

05-irfan khan

గత సంవత్సరం తన ట్విట్టర్ ద్వారా తాను ‘న్యూరోఎండోక్రిన్’ క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు ప్రకటించాడు ఇర్ఫాన్. ఇప్పటికి 4 రౌండ్ల ‘కీమోథెరెపీ’ ట్రీట్మెంట్ తీసుకుని… మరో రెండు రౌండ్ల ట్రీట్మెంట్ కోసం ఎదురుచూస్తూ… క్యాన్సర్ తో ఫైట్ చేస్తున్నాడు ఈ విలక్షణ నటుడు.

స్నేహా ఉల్లాల్

06-sneha ullal

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన స్నేహా ఉల్లాల్ కూడా ‘ఆటో ఇమ్యూన్ డిసార్డర్’ తో బాదపడిందట. ఇది ఒక రక్తానికి సంబందించిన ఒక వ్యాదని. దీని వలన తన రోగ నిరోధక శక్తి లోభించిందని తెలిపింది. దీని వలనే ఇండస్ట్రీకి దూరమయ్యి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటుంది.

సోనమ్ కపూర్

07-sonam kapoor

ప్రముఖ బాలీవుడ్ నటి.. ఫాషన్ ఐకాన్ అయిన.. సోనమ్ కపూర్ ‘డయాబేటిస్’ నుండీ బాధపడుతుందట. తన టీనేజ్ నుండీ ఈ సమస్య ఉందట.. పనిలో పడి.. ఆహారం టైంకి తీసుకోకపోవడం, అలాగే లేని.. పోని డైట్ ప్లాన్స్ వలనే.. ఈ వ్యాధికి గురయ్యిందట. ప్రస్తుతం దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకుంటుందట ఈ భామ.

కమల్ హాసన్

08-kamal haasan

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూడా ‘టైప్ 1 డయాబెటిస్’ తో బాదపడ్డారట. విభిన్న గెటప్లు , పాత్రలతో ఆడియన్స్ మెప్పించిన కమల్.. ఈ వ్యాధికి సరైన రీతిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ.. అదుపులో ఉంచుతున్నారట. టైం కి తిని.. టైం కి టాబ్లెట్స్ వేసుకుంటూ.. తన ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కమల్.

నయనతార

09-Nayanthara

‘లేడీ సూపర్ స్టార్’ నయనతార ‘స్కిన్ డిసార్డర్’ తో బాధపడుతున్నారట. మేకప్ లు వేసుకోవడం వలన తను ఈ డిజార్డర్ కి గురయ్యిందట. ముఖ్యంగా నాన్ వెజ్ తింటే ఈ వ్యాధి ఎక్కువగా ప్రభావం చూపుతుందట. దీనికోసం కేరళ వైద్యం, అలాగే ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటుందట.

అమితాబ్ బచ్చన్

10-amitabh bachchan

బిగ్ బి అమితాబ్ బచ్చన్ 1984లో ‘మిస్టేనియా గ్రావిస్’ అనే వ్యాధికి గురయ్యారట. దీని వలన శారీరకంగా మరియు మానసికంగా కూడా చాలా బలహీనమయ్యి పోయారట. ఇదిలా ఉంటే టి.బి తో కూడా బాదపడినట్టు తెలిపారు. దీనికి సంబందించిన ట్రీట్మెంట్ క్రమంగా తీసుకుంటున్నట్టు కూడా అభిమానులకు తెలిపారు.

సమంత

11-Samantha

అక్కినేని వారి కోడలు సమంత ‘పాలిమార్ఫస్ కాంతి విస్ఫోటనం’ తో బాధపడుతుందట. ఎండలో కాసేపు ఉంటే.. తన చర్మం ఎర్రబడిపోవడంతో పాటూ దురదలు కూడా మొదలయ్యి బాధిస్తుందట. బాగా రంగు ఉన్నవారికైతే ఇది మరింత బాదిస్తుందట. దీని కోసం సమంత ఎక్కువగా ఎండలో వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటుందని… షూటింగ్ సమయంలో ఈ పరిస్థితి రాకుండా దర్శక నిర్మాతలతో ముందుగానే చెబుతుందట.

దీపికా పడుకోణె

12-deepika padukone

ఇటీవలే.. రన్వీర్ ని వివాహం చేసుకున్న దీపికా పడుకోణె కూడా గతంలో డిప్రెషన్ కి గురయ్యిందట. ఈ వ్యాధి తో… ఎన్నో సమస్యలు ఎదుర్కొని.. చాలా ఒడుదుకులని ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకుందట. చివరికి మంచి స్థాయిలో నిలబడింది దీపికా. తన లాగే ఇలా డిప్రెషన్ గురయ్యే వారికోసం ప్రత్యేకంగా ఓ మెడికల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసి.. కొందరు మానసిక వైద్యులతో చికిత్స ఇప్పిస్తుంది. డిప్రెషన్ తో బాధపడే… ఎంతో మందికి దీపికా సక్సెస్ ఓ స్ఫూర్తి.

సల్మాన్ ఖాన్

13-salman khan

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ‘ట్రిగెమినల్ న్యూరల్జియా’ అనే వ్యాధితో బాధపడుతున్నాడట. ఇప్పటికీ దీని కోసం ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నాడట. ఈ వ్యాధి వలన తీవ్రమైన దవడ నొప్పి, బుగ్గలు బాధించడం వంటివి ఏర్పడేవట. అమెరికా లో ట్రీట్మెంట్ తీసుకుంటుండడంతో చాలా వరకు రికవర్ అయినట్టు తెలుస్తుంది.

మనీషా కొయిరాలా

14-manisha koirala

‘బొంబాయి’, ‘ఒకే ఒక్కడు’ వంటి చిత్రాలలో హీరోయిన్ గా నటించిన.. నిన్నటి తరం కధానాయిక మనీషా కొయిరాలా…! ఈమె రొమ్ము క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. ‘కీమోథెరఫీ ట్రీట్ మెంట్ తీసుకుంది. చాలా వరకు ఈమె విరోచనాలతో తీవ్రమైన బాధలు ఎదుర్కొంది. జుట్టు ఊడిపోయినప్పటికీ ఏమాత్రం బాధపడకుండా దీని గురించి అందరికీ తెలియజేసే విధంగా.. జాగ్రత్తలు చెబుతూ.. తన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యాన్సర్ ని తిప్పికోట్టింది. చాలా మంది క్యాన్సర్ తో బాధపడే వారు ఈమెను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share.