కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!

టాలీవుడ్ ఇండస్ట్రీ తొలి రోజుల్లో ఎలా ఉందో తెలీదు కానీ…ఇప్పుడు మాత్రం కులాన్ని బట్టి హీరోనూ అభిమానించే అభిమానులు ఎక్కువైపోతున్నారు… అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే నా కులం కాబట్టి నేను ఆ వ్యక్తిని అభిమానిస్తున్నాను అంటూ…ఇంకా పచ్చిగా మాటాడితే….వాడు మయ వాడురా అంటూ కాలర్ ఎగరేసుకుని మరీ తిరుగుతున్నారు…అయితే కులాల కోసం అభిమానులు కోట్లాడుకోవద్దు అని….తమకు అందరూ ఒకటేనని…ప్రతీ హీరో ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నా…ఈ జాడ్యం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు…

ఇదిలా ఉంటే ఇష్ట పడి చేసుకున్న పెళ్ళిళ్ళు అయినా….మన హీరోలు ఎక్కువశాతం కులాంతర వివాహాలు చేసుకున్నారు….కులం కన్నా…మతం కన్నా…ప్రేమ గొప్పది అని నిరూపించారు….మరి అలా పెళ్ళిళ్ళు చేసుకున్న మన హీరోలు ఎవరో తెలుసా….మీరే ఒక లుక్ వెయ్యండి…

పవన్ కల్యాణ్

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన పవన్ కల్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని విమర్శలు ఉన్నప్పటికీ ఆయన చేసుకున్న రెండు పెళ్ళిళ్ళు కులాంతర వివాహాలే కాదు…వేరే మతం…వేరే దేశం కూడా….రెండు దేశాయ్ మరాటి అమ్మాయి కాగా…అన్నా లెజ్నేవా….రష్యాకు చెందిన వారు..ప్రేమతో పేరుతో రెండు రాష్ట్రాలనే కాదు….రెండు దేశాలనే ఏకం చేసిన హీరో మన పవర్ స్టార్.

మహేష్ బాబు – నమ్రతా సిరొధ్కర్

వంశీ సినిమా షూటింగ్ సమయంలో అందాల భామ… ఆ సినిమా హీరోయిన్ నమ్రతా సిరొధ్కర్ తో ప్రేమలో పడ్డాడు ప్రిన్స్. తొలుత స్నేహంగా మారిన ఈ ఇద్దరి పరిచయం….ప్రేమగా మారడం…పెద్దలు అంగీకరించకపోవడంతో చాలా కాలం తరువాత 2005లో ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు…2006లో వీరికి అబ్బాయి పుట్టాగా….2012లో అమ్మాయి జన్మించింది.

అల్లు అర్జున్ – స్నేహా రెడ్డి

6allu-arjun-sneha-reddy

మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నాడు…అది కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్….ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూతురు అయిన స్నేహ రెడ్డిని ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మన బన్నీ….వాళ్లిద్దరికీ ఆయన్ అనే కుమారుడు జన్మించాడు.

రామ్‌చరణ్ – ఉపాసనరెడ్డి

5ram-charan-upasana

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ తన బాల్య స్నేహితురాలైన ఉపాసన రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అపోలో ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి కుమార్తె అయిన ఉపాసనా….సైతం చెర్రీని ఇష్టపడటంతో అందరి ఆశీర్వాదాలతో…వారి పెళ్లి ఘనంగా జరిగింది.

నాని – ఆంజనా

మన న్యాచురల్ స్టార్ నాని…తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న కాలంలో పరిచయం అయిన ఆంజనా….మంచి స్నేహితులారుగా మారడంతో ఇద్దరూ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.

మంచు విష్ణు – విరోనికా రెడ్డి

మంచు మనోజ్ హీరోగా ఢీ సినిమాకు కాస్ట్యూమ్ డిసైనర్ గా పనిచేసిన విరోనికా రెడ్డి మంచి విష్ణు ను ఇష్టపడటంతో…అటు విష్ణు కూడా ఆమె అంటే ఇష్టం కలిగి ఉండడంతో ఇద్దరూ ఒకటి అవ్వాలి అని ఇంట్లో చెప్పారు…అయితే తొలుత మోహన్ బాబు ఒప్పుకొనప్పటికీ ఆ తరువాత దాసరి సర్ది చెప్పడంతో అంగరంగా వైభవంగా ఈ పెళ్లి చేశారు…వారికి ఇద్దరు కవల ఆడ పిల్లలు పుట్టారు.

మంచు మనోజ్ – ప్రణతి రెడ్డి

మంచు వారి రెండో కుమారుడు మనోజ్ కూడా….ప్రేమ పెళ్లి చేసుకున్నాడు…తన వదిన వీరోనికా ద్వారా పరిచయం అయితే ప్రణతిని తొలి చూపులోనే ప్రేమించి అందరినీ ఒప్పించి 2015లో పెద్దలు అందరి సాక్షిగా ప్రేమ వివాహం చేసుకున్నాడు మనోజ్.

శివబాలాజీ – మధుమిత

ఇంగ్లీష్ కరన్ అనే సినిమాలో కలసి నటిస్తున్న సమయంలో ఒకరిపై మరొకరు ఇష్టం పెంచుకున్నారు మన యాక్టర్స్ శివ బాలాజీ….మధుమిత….2005లో వీరు ప్రేమలో పడగా..2009లో ఇద్దరూ ఒకటయ్యారు…ఇక 2010లో వీరికి ధావిన్ అనే కుమారుడు జన్మించాడు.

రాజశేఖర్ – జీవిత

యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ తలంబ్రాలు సినిమా సమయంలో జీవితను ఇష్టపడటం, ఇద్దరికీ ప్రేమ కలగడం, ఆది పెళ్లి పీటలవరకూ వచ్చి…కలసి జీవిత ప్రయాణం సాగించడం జరిగింది…ఇక ఇద్దరూ ఒకటై, ఎన్నో సినిమాలు నిర్మించారు. వీరికి ఇద్దరూ కుమార్తెలు.

శ్రీకాంత్ – ఊహ

ఈవీవీ దర్శకత్వంలో శ్రీకాంత్, ఊహ కలసి నటించిన సమయంలో ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటమే కాకుండా ప్రేమలో పడి…పెళ్లి చేసుకున్నారు…ఆమె సినిమా తరువాత ఆయనగారు సినిమా చేసిన వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కారు…ప్రస్తుతం వీరి కుమారుడు హీరోగా పరిచయం అయ్యాడు.

నాగార్జున – అమల

1-Nagarjuna and Amala Marriage images

టాలీవుడ్ కింగ్ నాగార్జున అమల ముఖర్జీతో చినబాబు అనే సినిమాలో యాక్ట్ చేశారు…ఇక తొలి పరిచయంతోనే ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడి శివ సమయంలో పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు…అయితే అప్పటికే నాగ్ కు వివాహం కావడంతో ఆ వివాహాన్ని చట్ట బద్దంగా రద్దు చేసుకుని…అమలను పెళ్లి చేసుకున్నాడు నాగ్. ఇక వీరి కుమారులు ఇద్దరూ టాలీవుడ్ యువ హీరోలుగా చాలామణీ అవుతున్నారు.

నాగ చైతన్య – సమంత

నాగ చైతన్య సమంత ప్రేమ జంట 2017లో గోవాలో ఘనంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6 మరియు 7తారీఖులలో హిందూ మరియు క్రిస్టియన్ సంప్రదాయాలలో వీరి పెళ్లి జరిగింది.

Share.