‘లెవెన్త్ అవర్’ టీజర్ : తమన్నా సక్సెస్ అవుతుందా..?

చాలా మంది తారలు ఓటీటీలో కనిపించడానికి ఆసక్తి చూపుతున్నారు. పాండమిక్ సమయంలో ఓటీటీకి డిమాండ్ పెరగడంతో స్టార్లు కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాజల్ లాంటి స్టార్ హీరోయిన్ హారర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. కానీ ఈ సిరీస్ పెద్దగా వర్కవుట్ కాలేదు. తాజాగా తమన్నా డిజిటల్ ఎంట్రీకి రెడీ అయింది. ఈ బ్యూటీ ‘లెవెన్త్ అవర్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఓ పుస్తకం ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ ను ఎనిమిది ఎపిసోడ్లుగా విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ సిరీస్ లో తమన్నా.. అరాత్రిక రెడ్డి అనే పాత్రలో కనిపించనుంది. కార్పొరేట్ కంపెనీని నడిపిస్తుంటుంది. కానీ ఆ రోల్ కి ఆమె అన్ ఫిట్ అని తన ఫ్యామిలీ, స్నేహితులు, శత్రువులు నమ్ముతారు. చివరికి కంపెనీ మూతపడే పరిస్థితికి వస్తుంది. మరి ఈ పరిస్థితుల నుండి హీరోయిన్ ఎలా బయటపడిందనే కాన్సెప్ట్ తో సిరీస్ ను తెరకెక్కించారు.

”చక్ర వ్యూహంలో చిక్కుకున్నప్పుడు దారి వెతికితే దొరకదు.. క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది” అనే డైలాగ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ కార్పొరేట్ డ్రామా ఏప్రిల్ 9న ‘ఆహా’ యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ కోసం తమన్నా చాలా కష్టపడింది. ఈ సిరీస్ షూటింగ్ సమయంలో ఆమె కరోనా బారిన కూడా పడింది. ఫైనల్ గా ఈ సిరీస్ తో ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది.


రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Share.