‘యాత్ర’ కలెక్షన్ల జోరు కాస్త తగ్గినట్టే ఉంది..!

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రం ఫిబ్రవరి 8 న విడుదలయ్యి మొదటి షో నుండే మంచి టాక్ ని సొంతం చేసుకుంది. వై.ఎస్.రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఆనందో బ్రహ్మ’ ఫేమ్ మహి వి.రాఘవ్ డైరెక్ట్ చేసాడు. ఇక వై.ఎస్.ఆర్ పాత్రలో మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టీ నటించారు. రావు రమేష్, అనసూయ, జగపతిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

మొదటి రోజు మంచి కల్లెక్షన్లని వసూలు చేసినప్పటికీ రెండు, మూడు రోజుల్లో కొంచెం తగ్గాయనే చెప్పాలి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేసారు. ఈ చిత్రం మొదటి రోజు జోరు చూసి.. ఈ వీకెండ్ లో 80% కలెక్షన్లు వస్తాయని నమ్మకంతో ఉన్న ట్రేడ్ కి షాకిచ్చింది. కేవలం 50% వరకే కల్లెక్షన్లని నమోదు చేయడం గమనార్హం. మొదటి వీకెండ్ పూర్తయ్యే సరికి ఈ చిత్రం 6 కోట్ల షేర్ ని రాబట్టింది. ఇక ఫస్ట్ వీకెండ్ ‘యాత్ర’… ఏరియా వైజ్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 1.15 కోట్లు
సీడెడ్ – 0.96 కోట్లు
వైజాగ్ – 0.32 కోట్లు

yatra-movie-first-weekend-collections2
గుంటూరు – 0.82 కోట్లు
ఈస్ట్ – 0.21 కోట్లు
వెస్ట్ – 0.31 కోట్లు
కృష్ణా – 0.40 కోట్లు

yatra-movie-first-weekend-collections1
నెల్లూరు – 0.28 కోట్లు
——————————————————-
టోటల్
(ఏ.పి + తెలంగాణా) – 4.45 కోట్లు
——————————————————-

yatra-movie-first-weekend-collections3

కేరళ – 0.47 కోట్లు
యూ.ఎస్.ఏ – 0.72 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.40 కోట్లు

———————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 6.04 కోట్లు
———————————————————

‘యాత్ర’ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 12 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్ర కలెక్షన్లు పర్వాలేదనిపించినప్పటికీ… మిగిలిన భాషల్లో పెద్దగా వసూళ్ళు నమోదుకావట్లేదు. ఇక ఈరోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకానుంది. ‘వీక్ డేస్’ లో ఈ చిత్రం బాక్సఫీస్ వద్ద ఎలా నిలబడుతుందో చూడాల్సి ఉంది. ఈ వారం కార్తీ చిత్రం ‘దేవ్’ తప్ప మరే పెద్ద చిత్రం లేకపోవడం… ‘యాత్ర’ చిత్రానికి కొంత వరకూ కలిసొచ్చే అంశం. మరి ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యే సరికి ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాల్సి ఉంది.

Share.