లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల విషయంలో క్లియర్ అవ్వని కన్ఫ్యూజన్

ఒక సినిమా గురువారం లేదా శుక్రవారం విడుదలవ్వాలంటే.. కనీసం మంగళవారానికి సెన్సార్ పూర్తవ్వాలి. అప్పుడే రిలీజ్ డేట్ తో అఫీషియల్ పేపర్ యాడ్స్ ఇచ్చుకోవడమే కాక టీవీ కమర్షియల్స్ కూడా మొదలెడతారు. కానీ.. వర్మ తాజా చిత్రం “లక్ష్మీస్” ఎన్టీఆర్” విషయంలో ఈ పద్ధతి ప్రకారం ఏమీ జరగడం లేదు. అసలే ఈ సినిమాకి సెన్సార్ వారు కట్స్ చెప్పిన తర్వాత రివైజింగ్ కమిటీకి వెళ్దామన్నది వర్మ మాస్టర్ ప్లాన్. కానీ.. అసలు సెన్సార్ స్లాట్ దొరకడమే గగనమైపోయింది మన వర్మకి. ముఖ్యంగా.. రెండు పెద్ద రాజకీయ పార్టీల సపోర్ట్ ఉన్నప్పటికీ.. “లక్ష్మీస్ ఎన్టీఆర్” రిలీజ్ కి నోచుకోవడం లేదు.

ముఖ్యంగా ఎలక్షన్స్ కి సరిగ్గా 20 రోజులు మాత్రమే ఉండడం.. రిజల్ట్స్ వచ్చే వరకూ ఈ తరహా చిత్రాలు రిలీజ్ చేయకూడదు అని ఎలక్షన్ కోడ్ కూడా ఉండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో పడ్డాడు వర్మ. మరి వెయిట్ చేసి ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత సినిమాను రిలీజ్ చేస్తాడా లేక తన పంతం నెగ్గించుకోవడానికి యూట్యూబ్ లో రిలీజ్ చేసేస్తాడా అనేది చూడాలి.

Share.