గ్యాప్ తీసుకుని వస్తున్నాడు.. హిట్టు కొడతాడా..!

ఒకప్పుడు రవితేజ సినిమా అంటే మినిమం గ్యారంటీ బ్రాండ్ ఉండేది. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ లాగా టాలీవుడ్లో రవితేజ అనేంతలా పాపులర్ అయ్యాడు. సంవత్సరానికి రెండు చిత్రాలు చేస్తూ చాలా మంది కొత్త డైరెక్టర్లకి ఛాన్సులు ఇచ్చేవాడు. హరీష్ శంకర్, శ్రీను వైట్ల, గోపీచంద్ మలినేని, బోయపాటి శ్రీను, బాబీ వంటి డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా రవితేజనే. అయితే ఇప్పుడు రవితేజ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘రాజా ది గ్రేట్’ చిత్రంతో మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చినా ఆ ఆనందం ఎంతో కాలం మిగల్లేదు. 2018 వ సంవత్సరంలో రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్టు’, అమర్ అక్బర్ ఆంటొని’ వంటి వరుస డిజాస్టర్లు అందుకోవడంతో రవితేజ మార్కెట్ బాగా దెబ్బతింది.

ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చి ‘డిస్కో రాజా’ చిత్రాన్ని లైన్లో మొదలుపెట్టాడు. ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ఫేమ్ వీఐ ఆనంద్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా ఈ చిత్రం రానుంది. 2019 సెకండ్ హాఫ్ లో ఈ చిత్రం రానుంది. ఇక మైత్రి ‘మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న తమిళ రీమేక్ ‘తేరి’ కూడా ఈ సంవత్సరరం సెకండ్ హాఫ్ లోనే రానుంది. సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ నుండీ మొదలుకానుందని సమాచారం. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఏదేమైనా ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ లోనే రవితేజ సందడి మొదలుకానుందని మాట. మరి ఈ రెండు చిత్రాలతో రవితేజ ఎలాంటి ఫలితాలు అందుకుంటాడా చూడాలి.

Share.