పవన్ సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు వేదిక దొరుకుతుందా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కార్యక్రమాలను పబ్లిక్ గ్రౌండ్ లో జరపాలంటే .. ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. పోలీసులు అనుమతులు ఇవ్వడం కష్టం. అందుకే ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేసిన అజ్ఞాతవాసి సినిమా ఆడియో రిలీజ్ వేడుకను హాల్లోనే జరిపించాలని అనుకుంటున్నారు. అయితే అందుకు కూడా వేదిక దొరకడం లేదు. ఎందుకంటే హైదరాబాద్ లో ఈనెల 15 వ తేదీ నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగనున్నాయి. ఈ సభలు సజావుగా జరగాలని పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఇతర సభలు, కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వడంలేదు. ఈ సభలు 19 తో ముగుస్తాయి.

దాని తర్వాత అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు అనుమతులు లభిస్తాయి. సో అప్పుడే.. అంటే ఈనెల 20 , 21 తేదీల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలని త్రివిక్రమ్ టీమ్ ఆలోచిస్తోంది. వేదిక మాత్రం హెచ్ఐసిసి ఖరారు చేసినట్లు సమాచారం. డేట్ ఫిక్స్ కాగానే మీడియాకు వెల్లడించనున్నారు. తమిళ దర్శకుడు అనిరుద్ కంపోజ్ చేసి, పాడిన రెండు పాటలు సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిగిలిన పాటలకోసం పవన్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ జనవరి 10 న రిలీజ్ కానుంది.

Share.