పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా రంగంలోకి దూకుతున్న మెగా హీరోస్

చిరంజీవి “ప్రజారాజ్యం” పెట్టే టైమ్ కి చరణ్ ఇంకా హీరోగా సెటిల్ అవ్వలేదు, పవన్ కళ్యాణ్ తోడు ఉన్నప్పటికీ.. అప్పటికి ఆయన ఆవేశం పార్టీకి బలం ఇవ్వలేకపోయింది. దాంతో చిరంజీవి ఒంటి చేత్తో ఎలక్షన్స్ లో పార్టీని లాక్కొచ్చాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిందే. మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ “జనసేన” అనే సొంత రాజకీయ పార్టీని పెట్టడమే కాక 2014 ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈసారి ఎలక్షన్స్ లో స్వయంగా, సొంతంగా ఎలాంటి పొత్తులు లేకుండా రంగంలోకి దూకుతున్నాడు.

అయితే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిలా ఒంటరివాడు కాదు. ఆయనకి ఇప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ లాంటి మెగా హీరోలందరి సపోర్ట్ ఉంది. ఆల్రెడీ చిన్నన్నయ్య నాగుబాబు పార్టీలో జాయినై సపోర్ట్ చేస్తుండగా.. మెగా అభిమానుల అండదండలు ఎలాగూ ఉంటాయి. సో.. పవన్ కళ్యాణ్ కోసం త్వరలోనే రామ్ చరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్ లు సోషల్ మీడియాలో సపోర్ట్ చేయడమే కాక కొన్ని రోడ్ షోస్ కి కూడా అటెండ్ అవుతారని వినికిడి. ఒక వారం రోజులపాటు తమ సమయాన్ని పవన్ కళ్యాణ్ కోసం కేటాయించారు అందరూ.

Share.