అభినయ పాఠశాల కోట శ్రీనివాస్ రావు

సినిమా అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇష్టమైన హీరోనూ అనుకరించడం, అందాల భామల ఫోటోలకు పూజలు చేయడం, తమకు నచ్చిన దర్శకుల పేర్లతో ఫేస్‌బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసి మరీ ప్రమోట్ చెయ్యడం, ఇలా ఒక్కటి కాదు, దాదాపుగా ప్రస్తుత తరంపై సినిమా ప్రభావం చాలానే ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పుడున్న తరం వారికి తెరపై ఎన్టీఆర్, ఎస్వీఆర్, రావు గోపాల్ రావుణి చూసి అదృష్టం ఎలాగూ కలగలేదు. ఇక వారి తరువాత సినీ ఇండస్ట్రీలో ఏ పాత్రలో అయినా ఒదిగిపోయి జీవించే నటుడు ఎవరైనా ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉన్నారు అంటే ఒకే ఒక నటుడు ‘కోటా శ్రీనివాస రావు’. ఇదిలా ఉంటే ప్రతీ పాత్రలో తన విలక్షణమైన నటనతో కోటా దాదాపుగా 36ఏళ్ల నుంచి జీవిస్తూనే ఉన్నారు. ఇక మరో పక్క ఒక్కసారి ఆయన నటనా ప్రస్థానం చూస్తే….అంచెలంచెలుగా ఎదిగిన కోటా….ఎలాంటి పాత్రలు, ఎటువంటి నటన కనబరిచారో తెలుస్తుంది…..

Kota Srinivasa Rao,Kota Srinivasa Rao Movies

‘స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా’లో పనిచేసిన కోటా ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి, ‘ప్రతిఘటన’ సినిమాలో తెలంగాణా యాసతో అందరినీ మెప్పించాడు. అయితే అదే క్రమంలో ‘మండలదీసుడు’ అనే సినిమాలో తనకు తెలియకుండానే తాను అప్పటి ముఖ్యమంత్రి, కారణ జన్ముడు, ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ పై శెటైర్స్ సేసె పాత్రలో నటించాడు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ తరపు నిలిచాన ఇండస్ట్రీ దాదాపుగా ఏడాది పాటు కోటాని పక్కకు పెట్టింది. ఒకానొక క్షణంలో ఎన్టీఆర్ ను కలసి క్షమాపణ చెప్పగా, ఆయన అక్కున చేర్చుకున్నారు. ఇక ఆ తర్వాత వరుసగా, ఖాళీ లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లారు కోటా….శివ, మనీ, గాయం, గోవిందా గోవిందా సినిమాల్లో మంచి నటన కనబరిచారు.

Kota Srinivasa Rao,Kota Srinivasa Rao Movies

ఇక హలో బ్రదర్ సినిమాలో తాడి మట్టయ్య పాత్రలో, ఆయన పండించిన హాస్యం కడుపు చెక్కలయ్యేలా చేస్తుంది, అదే క్రమమలో స్నేహితుడు చనిపోయిన క్షణంలో ఆయన కన్నీరు పెడుతుంటే సగటు ప్రేక్షకుడి గుండె చలించుకు పోయింది.

Kota Srinivasa Rao,Kota Srinivasa Rao Movies

ఇక ఆ తరువాత, బిగ్ బాస్, అనగనగా ఒక రోజు, లిటిల్ సోల్జర్స్ బావగారు బాగున్నారా సినిమాల్లో హాస్య రసమైన పాత్రలతో నటించి మెప్పించారు.
ఇదిలా ఉంటే అప్పట్లో వచ్చిన ‘అహనా పెళ్ళంట’ చిత్రంలో బ్రహ్మ్మీ తో కలసి ఆయన పండించిన హాస్యానికి యావత్ ప్రేక్షక లోకం మంత్ర ముగ్దులయ్యింది. అదే క్రమంలో గణేశ్ సినిమాలో కోటాను చూసి అసహ్యించుకోని వారుండరు. అదే క్రమంలో క్లైమ్యాక్స్ లో ఆయన నటన చూసి వాహ్…ఏం నటించాడురా అని మెచ్చుకున్నవారు ఉన్నారు.

Kota Srinivasa Rao

ఇలా రకరకాల పాత్రలతో ప్రేక్షక లోకాన్ని దాదాపుగా 36ఏళ్ల నుంచి మెప్పిస్తున్న కోటా శ్రీనివాసరావు, ఒక తండ్రిగా, పిసినారి రాజకీయనాయకుడిగా, శారద ఇన్‌స్పెక్టర్ గా, లాయర్ గా, ఊరిలోని సర్పంచ్ గా, విలన్ గా, శత్రువుగా, కుల్ళుతో రగిలిపోయే తమ్ముడిగా, ఇలా ఒకటేంటి తానకు వచ్చిన ప్రతీ పాత్రలో ఒదిగిపోయి మరీ….శబాష్ అనిపించుకున్నాడు. అందుకే ‘నటనకు’ కంచుకోట “కోటా” అని అంటారు.

 

Share.