విడాకుల తీసుకున్న భర్తల మీద కంగనాకు ఎందుకంత ఇంట్రెస్ట్

కొందరు హీరోయిన్లకి కొన్ని లిమిటేషన్స్ లేదా రూల్స్ ఉంటాయి. సెట్ లో ఏసీ ఉండాలి, సపరేట్ క్యారీ వ్యాన్ ఉండాలి, ఇద్దరు అసిస్టెంట్స్ ఉండాలి అని దర్శకనిర్మాతలకి చాలా రూల్స్ చెబుతుంటారు. కానీ.. బాలీవుడ్ కథానాయిక కంగనాకు పైన పేర్కొన్నవి మాత్రమే కాక.. మరో స్పెషల్ రూల్ కూడా ఉన్నట్లుంది. చూస్తుంటే.. ఆమె కేవలం డివోర్స్ తీసుకొన్న మగాళ్లతో మాత్రమే కలిసి పని చేస్తుందేమోననిపిస్తుంది. అందుకు కారణం లేకపోలేదు.. “క్రిష్ 3” కథానాయకుడు హృతిక్ రోషన్ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాతే కంగనాతో సినిమా చేశాడు.

ఆ సినిమా పూర్తయ్యేసరికి హృతిక్ తనను ఫిజికల్ గా వాడుకున్నాడని కంగనా రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రీసెంట్ గా క్రిష్ దర్శకత్వంలో “మణికర్ణిక” చిత్రంలో నటించింది కంగనా. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే క్రిష్ కి భార్య రమ్యతో వచ్చిన విబేధాల కారణంగా వేరుపడ్డారు. ఇప్పుడు కంగనా ప్రకటించిన తాజా చిత్రం “అమ్మ” సినిమాకి దర్శకత్వం వహించేది ఎ.ఎల్.విజయ్. ఈ తమిళ దర్శకుడు అమలాపాల్ ను పెళ్లాడి అనంతరం జరిగిన గొడవల కారణంగా విడాకులు తీసుకొన్నాడు. దాంతో కంగనా కేవలం విడాకులు తీసుకున్న మగవాళ్ళతో మాత్రమే వర్క్ చేస్తుందా అని నవ్వుకోవడం మొదలెట్టారు జనాలు.

Share.