త్రివిక్రమ్ విషయంలో మరోసారి అదే నిజమైంది..!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ‘గీత ఆర్ట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూజ హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా పేతురాజ్, సుశాంత్, నవదీప్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. తమన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. త్రివిక్రమ్ గత చిత్రం ‘అరవింద సమేత’ టీజర్ ను ఆగష్టు 15 కె విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక బన్నీ తో చేయబోయే సినిమా టైటిల్ ను కూడా ఆగష్టు 15 కె రెవీల్ చేసాడు. అంతేకాదు ఈ చిత్రంలో బన్నీ పాత్రని పరిచయం చేస్తూ ఒక వీడియో ని కూడా వదిలాడు.

allu-arjun-trivikram-movie-launched

ఈ చిత్రానికి ‘అల వైకుంఠపురంలో’ అనే టైటిల్ ను పెట్టాడు త్రివిక్రమ్. నిజానికి ఈ టైటిల్ రెండు రోజుల ముందే లీకయ్యింది. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇదే అసలు టైటిల్ అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రేక్షకులు కూడా ఫిక్సయిపోయారు. అసలు ప్రేక్షకులు కానీ, బన్నీ ఫ్యాన్స్ ఇలా ఎందుకు ఫిక్సయిపోయారు అనే సందేహం మాత్రం కలుగక మానదు. ఈ మధ్య త్రివిక్రమ్ చిత్రాలు ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘అఆ’ ‘అజ్ఞాతవాసి’ ‘అరవింద సమేత’ వంటి చిత్రాలకి కూడా ఇలాగే జరిగింది. ఆ టైటిల్స్ ను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయడనికి ముందే లీకయ్యాయి. ఓ పెద్ద సినిమాకి ఎటువంటి లీకులు జరగకుండా ముందు నుండీ జాగ్రత్త పడుతుంటారు. అయితే త్రివిక్రమ్ విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది అనే సందేహం కలుగక మానదు. ఒకవేళ కావాలనే త్రివిక్రమ్ ఇలా సోషల్ మీడియాలో లీక్ చేస్తున్నాడా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. మరి దీని వెనుక అసలు కారణం ఏంటనేది అర్ధం కానీ ప్రశ్న..!

Share.