అనవసరంగా బోయపాటిని బాధ్యుడ్ని చేశారు

“వినయ విధేయ రామ” విడుదలైనప్పట్నుంచి.. “రంగస్థలం” లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఇలాంటి ప్రొజెక్ట్ చేసినందుకు రామ్ చరణ్ మీద ఎంత మంది జాలిపడ్డారో తెలియదు కానీ.. అంతకుమించిన జనాలు బోయపాటి మీద దాడి చేశారు. ఒక దర్శకుడిగా బోయపాటి కెరీర్ ను చూస్తే ఒక్క దమ్ము తప్ప మరో ఫ్లాప్ లేదు. బెల్లంకొండ లాంటి హీరోతో తీసిన “జయ జానకి నాయక” కూడా కేవలం బోయపాటి టేకింగ్ & ఆయనకి మార్కెట్ లో ఉన్న క్రేజ్ వల్లే ఆ సినిమా హిట్ అయ్యింది. కానీ.. ఆ విషయాన్ని జనాలు మర్చిపోయి “వినయ విధేయ రామ” లాంటి ఒకే ఒక్క ఫ్లాప్ కు ఆయన్ని బాధ్యుడ్ని చేసి తెగ తిట్టడం మొదలెట్టారు.

ఇక కొన్ని వెబ్ సైట్స్ అయితే.. “బోయపాటితో సినిమాలు చేయాలంటే దర్శకులు భయపడుతున్నారని, నిర్మాత దానయ్యకి బోయపాటికి గొడవ అయ్యిందని” ఇలా చాలా ఆర్టికల్స్ వచ్చాయి. దాంతో ఆ ఆర్టికల్స్ చదివి బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోయాడు బోయపాటి. కానీ.. తన తదుపరి చిత్రం ప్రీప్రొడక్షన్ వర్క్స్ లో బిజీ అయిపోయాడు. కానీ.. ఆయన సన్నిహితులు మాత్రం బోయపాటి మీద వస్తున్న వార్తలు చూసి బాధపడుతున్నారు.

Share.