సెట్ కాని కొరటాల, చరణ్ కాంబినేషన్!

కొన్ని కాంబినేష‌న్లు ఆస‌క్తిని కలిగిస్తుంటాయి. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయ్య క‌ళ్ల‌తో ఎదురుచూసేలా చేస్తాయి. కొన్ని రోజుల క్రితం అధికారికంగా ప్రకటించిన మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, హ్యాట్రిక్ హిట్‌ చిత్రాల ద‌ర్శ‌కుడిగా పేరు తెచ్చుకున్న కొర‌టాల శివ కాంబినేష‌న్ అలాంటిదే. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో త్వ‌ర‌లో సినిమా మొద‌లుకానుందని అభిమానులు అనుకుంటుండగా అసలు విషయం తెలిసి షాక్ కి గురయ్యారు. త‌న సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్లో మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో కలిసి  నిర్మించాలన్న సినిమా ఆగిపోయిందని సమాచారం.  గతంలో మిర్చి తర్వాత చరణ్, కొరటాల దర్శకత్వంలో నటించాలనుకున్నారు. కానీ ఆ మూవీ ఆగిపోయింది.

ఇప్పుడు రెండోసారి అలాగే జరిగింది. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 మూవీ చేస్తున్నారు. దీని తర్వాత కొరటాలకి ఇవ్వాల్సిన డేట్లు బోయపాటి శ్రీనుకి చెర్రీ ఇచ్చినట్లుగా ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. అందుకే బోయపాటి  ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా  ఉన్నారని, వచ్చేనెలలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కవచ్చని  టాక్. మరో వారం రోజుల్లో బోయపాటి, చరణ్ సినిమాకు మూహర్తం షాట్ కూడా ఫిక్స్ చేశారట. ఇదంతా బాగానే ఉంది కానీ అపజయం ఎరుగని డైరక్టర్ కొరటాలను రాంచరణ్ ఎందుకు పక్కన పెట్టినట్లు అనేది ఎవరికీ అర్ధం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది.ff-ad

Share.