ప్రభాస్ ఏంటి ఇలా అయిపోయాడు..!

అదేంటో కానీ ‘బాహుబలి’ చిత్రం పూర్తయ్యాక రెట్టింపు వేగంతో సినిమాలు చేస్తాడని అభిమానులు ఎంతో ఆశపెట్టుకున్నారు. అయితే పరిస్థితి మారిపోయింది. ‘బాహుబలి’ కి ముందు ప్రభాస్ అయితే మీడియం బడ్జెట్ లో ఓ చిత్రం చేసేసి… మరో చిత్రానికి ఓకే చెప్పెయ్యొచ్చు. కానీ ‘బాహుబలి’ తరువాత ప్రభాస్ ఇండియా వైడ్ స్టార్ అయిపోయాడు. మిగిలిన భాషల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సో ప్రభాస్ ఇదివరకటిలా సినిమాలు చేసేయడం సరి కాదు. కచ్చితంగా ప్రభాస్ సినిమా మంచి క్వాలిటీతో ఉండాలి. భారీ బడ్జెట్ పెట్టాలి. కనీసం మూడు నాలుగు భాషల్లో సినిమాని విడుదల చేయాలి.. అందుకోసం అన్ని భాషల ప్రేక్షకులకి నచ్చేలా కథల్ని ఎంచుకోవాలి.

fans-upset-with-prabhas-look1అందుకే ‘సాహో’ చిత్రం మొదలుపెట్టాడు. ఇది 300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం. ప్రభాస్ స్నేహితులైన యూవీ క్రియేషన్స్ వారే నిర్మాతలు. సుజీత్ డైరెక్టర్. ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా కష్టపడుతున్నాడు. ఈ చిత్రంతో పాటూ ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా 150 కోట్ల భారీ బడ్జెట్ చిత్రమే. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అలాగే మరో పక్క ‘సాహో’ లాంటి యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. అందుకు తగినట్టే లుక్స్ మార్చి… ఒళ్ళు హూనం చేసుకుంటున్నాడు మన డార్లింగ్. ‘సాహో’ సెట్స్ లో నీల్ నితిన్ తండ్రితో ప్రభాస్ దిగిన ఫోటో చూస్తే ఇదే స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఫోటో చూసిన ప్రభాస్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘అయ్యో డార్లింగ్ కు ఏమైంది’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ ఫొటోలో ప్రభాస్ అలా ఉన్నాడు. ముక్కు వాచినట్టు… ఆరోగ్యం అస్సలు బాలేనట్టుగా కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Share.