వరుణ్‌ సందేశ్‌ భార్యపై ప్రశంసలు గుప్పిస్తున్న నెటిజనులు

హీరో వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక షేరూ మరోసారి వార్తల్లోకెక్కారు. నాలుగురోజుల క్రితం కుటుంబ కలహాలతో వితికా షేరూ ఆత్మహత్య ప్రయత్నం చేశారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని టీవీ ఛానళ్లు వార్తలను ప్రసారం చేశాయి. ఆసుపత్రిలో ఉన్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలను  వితికా మీడియా ముఖంగా ఖండించారు. తాను, వరుణ్ సందేశ్ సంతోషంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఆ విషయాన్ని మరిచిపోతున్న సమయంలో వితిక మరో మారు వార్తల్లోకెక్కారు.

నెటిజనులయితే అభినందనలతో ముంచెత్తుతున్నారు. కారణం ఏమిటంటే.. క్యాన్సర్ రోగుల చికిత్సకోసం నిధులను సమకూర్చడంలో భాగంగా వితిక తన జుట్టుని విరాళంగా ఇచ్చింది. “ఏళ్ల తరబడి ఇష్టంగా పెంచుకున్న జుట్టును ఇవ్వడం కొంత ఇబ్బందికరమే. అయినా క్యాన్సర్‌ బాధితులను దృష్టిలో ఉంచుకొని, తల వెంట్రుకలను క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అధ్యార్‌(చెన్నై)కు విరాళంగా ఇచ్చాను”అని వితిక వెల్లడించారు. వితిక జుట్టు కత్తిరించుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో రావడంతో నెటిజన్లు ఆమె చేసిన పనిని ప్రశంసించారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.