అర్జున్ రెడ్డి కంటే కబీర్ సింగ్ బాగున్నాడని ప్రభాస్ అనడమే కారణం

టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేష్ తర్వాత యాంటీ ఫ్యాన్స్ కానీ ఎలాంటి కాంట్రార్సీలు కానీ లేని ఏకైక హీరో ప్రభాస్. మనోడు అందరికీ స్నేహితుడే.. నందమూరి, మెగా, ఘట్టమనేని, అక్కినేని అనే తేడా లేదు.. అందరికీ ఇష్టుడే. అందుకే.. అందరు హీరోల అభిమానులు ప్రభాస్ కి కూడా ఫ్యాన్స్ అయిపోతుంటారు. కానీ.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ ను టార్గెట్ చేసి నిన్నటి నుంచి తిట్టడం మొదలెట్టారు. నిజానికి విజయ్ కూడా ప్రభాస్ ఫ్యానే. “ట్యాక్సీవాలా” రిలీజ్ టైమ్ లో ప్రభాస్ ఆల్ ది బెస్ట్ ట్వీట్ వేస్తే దానికి విజయ్ దేవరకొండ రిప్లైగా “అన్నా సాహో అప్డేట్స్ ప్లీజ్” అని రిప్లై ఇవ్వడం అందర్నీ ఆకట్టుకొంది.

కానీ.. నిన్నట్నుంచి ప్రభాస్ ను విజయ్ దేవేరకొండ ఫ్యాన్స్ కొందరు తెగ తిడుతున్నారు. కారణం ఏంట్రా అంటే.. మొన్నామధ్య విడుదలైన “కబీర్ సింగ్” టీజర్ చూసిన ప్రభాస్ వెంటనే హీరో షాహిద్ కపూర్ కి కాల్ చేసి మరీ “టీజర్ చాలా బాగుంది.. ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా నచ్చింది” అని చెప్పాడట. ఈ వార్త బయటకి వచ్చేసరికి “విజయ్ కంటే షాహిద్ బాగున్నాడని అనడం తప్పు ప్రభాస్” అని పోస్టులు, మీములు పుట్టుకొచ్చాయి. మరి ఈ విషయం ఇక్కడితో ఆగిపోతుందా లేక కొనసాగుతుందా అనేది చూడాలి.

Share.