ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయబాపినీడు మరణం

నిర్మాతగా, కథా రచయితగా, దర్శకుడిగా పరిశ్రమలో అందరికీ మంచి అడ్వైజర్ గా సినీ పరిశ్రమకు అమూల్యమైన సేవల్ని అందించిన విజయ బాపినీడు ఇవాళ ఉదయం మరణించారు. చిరంజీవి, కృష్ణలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను రూపొందించిన ఆయన కమల్ హాసన్ తమిళంలో నటించిన కొన్ని సినిమాలను తెలుగులో డబ్బింగ్ కూడా చేశారు. చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా పేర్కొనే “మగమహారాజు, గ్యాంగ్ లీడర్” చిత్రాలకు విజయ బాపినీడు దర్శకత్వం వహించడం విశేషం. అప్పటివరకూ ఫ్యామిలీ సినిమాలు మాత్రమే విజయం సాధిస్తున్న తరుణంలో మాస్ సినిమాలను మొదలెట్టడమే కాక.. ఆ మాస్ సినిమాలకు క్లాస్ టచ్ ఇచ్చి.. మాస్ థియేటర్స్ లో క్లాస్ ఆడియన్స్ చేత విజిల్స్ కొట్టించిన ఘనత విజయ బాపినీడుది.

1-gang-leader

2-gang-leader

చిరంజీవికి “బిగ్ బాస్” లాంటి డిజాస్టర్ ఇచ్చినప్పటికీ.. ఆ సినిమాలో ఆయన చిరంజీవికి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ గుండెల్లో చెరగని విధంగా నిలిచిపోయాయి. చిరంజీవి, అల్లు అరవింద్ లకు అత్యంత సన్నిహితుడైన విజయ బాపినీడు.. అప్పట్లో “గ్యాంగ్ లీడర్” శతదినోత్సవ వేడుకలను ఒకేరోజు నాలుగు థియేటర్ల దగ్గర నిర్వహించిన ఘనత కూడా విజయ బాపినీడుకే సొంతం. అందుకే ఆయన్ని ఇండస్ట్రీ జనాలు, మెగా అభిమానులు ముద్దుగా గ్యాంగ్ లీడర్ అని పిలుచుకుంటారు. అలాంటి వ్యక్తి మరణం ఇండస్ట్రీకి తీరని లోటు.

3-gang-leader

Share.