రచయితగా బిల్డప్ కొట్టడానికి రెడీ అయిన రౌడీ హీరో..!

విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రం వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతుంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యిందట. మొదట ఈ చిత్రాన్ని మే 31 న విడుదల చేయాలని భావించినప్పటికీ రిషూట్ల కారణంగా జులై 26 కి మారినట్టు తెలుస్తుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని విజయ్ భావిస్తున్నాడట. ఇక మరోపక్క క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో తెరకెక్కే చిత్రం షూటింగ్లో కూడా విజయ్ బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్రం నుండీ ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

ఈ చిత్రంలో విజయ్ రైటర్ గా కనిపించబోతున్నాడట. ‘కథలను వివిధ రకాల వేరియేషన్స్ తో అల్లుతూ సొంత కథలో తనకు తానే హీరోగా కనిపిస్తుంటాడట. తాను రాసిన కథలు చాలా గొప్పవని అందుకే తాను నటిస్తేనే గొప్పగా ఉంటుందని’ బిల్డప్ ఇచ్చే ఓ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ లో విజయ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడని తెలుస్తుంది. రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసే అవకాశం ఉందట.

Share.