మరో అరుదైన గౌరవం దక్కించుకున్న విజయ్ దేవరకొండ..!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ‘పెళ్ళిచూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ వంటి చిత్రాలతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. కేవలం మూడేళ్ళలో ఇంత ఫాలోయింగ్ ను సంపాదించుకోవడం అంత సులభం కాదు. ప్రస్తుతం రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నాడట. కేవలం టాలీవుడ్లో మాత్రమే కాదు, కోలీవుడ్, బాలీవుడ్లో కూడా విజయ్ దేవరకొండ పేరు మారుమోగిపోతుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఏకంగా మహేష్, ప్రభాస్ లనే డామినెట్ చేసేసాడట విజయ్.

తాజాగా జరిగిన హైదరాబాద్ 2018 ‘మోస్ట్ డిజైరబుల్‌ మేన్‌’ లిస్ట్‌లో విజయ్ టాప్‌ ప్లేస్‌ ని దక్కించుకున్నాడు. మహేష్ – ప్రభాస్ అలాగే రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్స్ ను ధాటి విజయ్ ఈ గుర్తింపు దక్కించుకోవడం సంచలనంగా మారింది. ఇక రెండో స్థానంలో ప్రభాస్, మూడో స్థానంలో రాంచరణ్, నాలుగవ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. ఇక విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ త్వరలో విడుదలకాబోతుండగా… క్రాంతి మాధవ్ డైరెక్షన్లో మరో చిత్రం కూడా మొదలుపెట్టేచేసాడు.

Share.