డియర్ కామ్రేడ్ టీజర్ ను తెగ ట్రోల్ చేస్తున్నారుగా

నిన్న విడుదలైన “డియర్ కామ్రేడ్” టీజర్ వ్యూస్ పరంగా సరికొత్త సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టీజర్ లో ఉన్న కంటెంట్ కంటే.. విజయ్ దేవరకొండ-రష్మిక మండన్నల కిస్ బాగా క్లిక్ అయ్యింది. బేసిగ్గా అది మార్కెటింగ్ ట్రిక్ అయినప్పటికీ.. ఆ టీజర్ పుణ్యమా అని విజయ్ కి ఒక కొత్త బిరుదు వచ్చింది. ఇప్పటివరకూ విజయ్ దేవరకొండకి ఒక స్పెషల్ స్క్రీన్ నేమ్ అని ఏమీ లేదు. కానీ.. నిన్న ఆ టీజర్ విడుదలైనప్పట్నుంచి మనోడ్ని సోషల్ మీడియాలో “తెలుగు ఇమ్రాన్ హష్మీ” అని ట్రోల్ చేయడం మొదలెట్టారు. అందుకు కారణం మనోడు గత మూడునాలుగు సినిమాల్లో లిప్ లాక్స్ ఉండడమే.

అలాగే.. విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ సెలక్షన్ మీద కూడా ట్రోలింగ్ మొదలైంది. కేవలం ముద్దు సీన్స్ ఉంటేనే విజయ్ దేవరకొండ కథలు యాక్సెప్ట్ చేస్తాడని, ఇక అతడి భవిష్యత్ చిత్రాల్లోనూ ముద్దు సీన్లు చాలా కమాన్ అని కూడా ట్రోలింగ్ మొదలెట్టారు. విజయ్ నిజంగా అలా చేస్తాడా లేదా అనే విషయం పక్కన పెడితే.. ప్రస్తుతం ఆ ట్రోల్స్ & మీమ్స్ మాత్రం బాగానే వైరల్ అవుతున్నాయి.

Share.