రాజస్థాన్ లో ఘనంగా కుమార్తె వివాహ వేడుకను ఏర్పాటు చేసిన వెంకీ

ఒక్కోసారి కొన్ని విషయాలు భలే విచిత్రంగా అనిపిస్తుంటాయి. మన విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న “వెంకీ మామ” షూటింగ్ జరుగుతుండగానే ఆయన నిజ జీవితంలోనూ మామ అయ్యాడు. ఆయన పెద్ద కుమార్తె ఆశ్రిత పెళ్లి రేపు జయపూర్ లో ఘనంగా జరగనుంది. ఆల్రెడీ టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలందరూ అక్కడికి ప్రయాణం మొదలెట్టారు. సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి వాళ్ళందరూ అక్కడికి చేరుకొని రచ్చ మొదలెట్టారు. హైద్రాబాద్ రేస్ క్లబ్ ఓనర్ సురేందర్ రెడ్డి మనవడైన వినాయక రెడ్డితో జరగనున్న ఈ వివాహ వేడుక ఘనంగానే కాక సీక్రేట్ గానూ ఉండనుంది. వెంకటేష్ మరియు రాణాకు అత్యంత సన్నిహితులైన వారు మాత్రమే ఈ వేడుకకి హాజరుకానున్నారు.

కుదిరితే.. హైద్రాబాద్ లో ఇండస్ట్రీ అందర్నీ పిలిచి రిసెప్షన్ లాంటిది ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మన సూపర్ కూల్ వెంకీ మామ మాత్రం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఏదైనా తన కూతురు కోరిక మేరకు ప్రేమ వివాహం అంగీకరించడమే కాక ఘనంగా ఆ వివాహ వేడుకను నిర్వహించడం అనేది అభినందనీయం.

Share.