చాలా సంతోషంగా ఉంది నాన్న: వరుణ్ తేజ్

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి మొదలైంది. ఇప్పటికే తెలుగు దేశం, వై.సి.పి పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయి. ఇక ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కూడా పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాలకి పర్యటిస్తూ జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాడు. ఇక ఈ మెగాహీరోల నుండీ కూడా జనసేన పార్టీకి ప్రచారం జరుగుతుందనేది తెలిసిన సంగతే. మొన్నటికి మొన్న నిహారిక తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కి ఓటేయమని ‘సూర్యకాంతం’ ప్రమోషన్స్ లో చెప్పుకుంటూ వచ్చింది. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు కూడా జనసేన లో చేరారు. నరసాపురం ‘ఎం.పి’ గా నాగబాబు పోటీ చేయబోతున్నట్టు ఇటీవల పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

varun comments on nagababu

ఇప్పుడు నాగబాబు జనసేనలో చేరడం మెగా అభిమానుల్లో కొత్త ఆనందాన్ని నింపింది. ఇక నాగబాబు కొడుకు… మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా తాజాగా ఈ విషయం పై స్పందించాడు. తన ట్విట్టర్ ద్వారా వరుణ్ తేజ్ ఈ విషయం పై స్పందిస్తూ… “నాన్న జనసేన పార్టీలో చేరడం నిజంగా ఆనందాన్ని కలిగిస్తోంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన పార్టీ తరుపున పోటీకి దిగడం కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది” అంటూ పేర్కొన్నాడు. దీంతో … వరుణ్ కూడా జనసేన తరుపున ప్రచారం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘వాల్మీకి’ చిత్రం చేస్తూనే కొర్రపాటి కిరణ్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు వరుణ్ తేజ్.

Share.