మిస్టర్ మూవీ ట్రైలర్ | వరుణ్ తేజ్, హెబ్బా పటేల్, లావణ్య

“చై ఒక్కడు తోడుగా ఉంటే చాలు .. వందమంది సైన్యం లా కాపాడుతాడు” .. మిస్టర్ గురించి డైరక్టర్ శ్రీనువైట్ల  ఒకే మాటలో చెప్పేశారు. ఈ స్టార్ డైరక్టర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన మిస్టర్ మూవీ ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదలై విశేషంగా ఆకట్టుకుంటోంది. 2:14  నిముషాల నిడివిగల ఈ వీడియోలో అన్ని ఎమోషన్స్ పొందుపరిచి చిత్ర బృందం సినిమాపై అంచనాలను పెంచేసింది. వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న శ్రీను వైట్ల అందమైన ప్రేమకథ ను తీసుకొని తెరకెక్కించిన ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే మంచి భావోద్వేగాల సమ్మేళనం లా కనిపిస్తోంది.

ఎమోషన్స్ తో పాటు కామెడీ కూడా మిస్ కానట్లు “మందు తాగకుండా, మటన్ తినకుండా ఎలా బతుకుతారు?, వీళ్ళు అసలు మనుషులా పశువులా?” అనే ఈ డైలాగ్ ద్వారా చెప్పారు. బ్యూటిఫుల్‌ విజువల్స్‌కి తోడు మిక్కీ జె మేయర్ మ్యూజిక్ తోడై ప్లజంట్ గా అనిపిస్తోంది. ఇందులో హెబ్బా పటేల్ చిలిపిగా కవ్విస్తుంటే, లావణ్య త్రిపాఠి పోటీ పడి నటించినట్లు తెలుస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), ‘ఠాగూర్‌’ మధు నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.