మహేష్ కథల్లో వైవిధ్యాలు

తెలుగు చిత్ర పరిశ్రమలో సాహసాలకు మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన నట వారసుడిగా అడుగు పెట్టిన మహేష్ బాబు తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నారు. మూసకథలను పక్కన పెట్టి, వైవిధ్య కథలను చేపట్టి.. హిట్స్ ని సొంతం చేసుకున్నారు. తనకి సూట్ కానీ జానపథం, పౌరాణిక, చారిత్రక కథల జోలికి వెళ్లకుండా.. మిగిలిన అన్ని జాన్రాలో సినిమాలు చేశారు. అపజయాలను పలకరించినప్పటికీ ఛాలెంజిగ్ రోల్స్ చేయడంలో వెనకడుగు వేయడం లేదు.

అడ్వెంచర్ Takkari Dongaకౌ బాయ్ కథలకు ఈ సమయంలో డిమాండ్ లేదు.. అయినప్పటికీ టక్కరిదొంగ తో అడ్వెంచర్ మూవీ చేశారు. ఈ మూవీ కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ మహేష్ అందరితో అభినందనలు అందుకున్నారు.

యాక్షన్ Okkaduక్లాస్ హీరోగా పేరు తెచ్చుకున్న మహేష్ మాస్ ప్రజలకు మాత్రం విందు ఇవ్వడం మరిచిపోలేదు. ఒక్కడు సినిమాతో మొదలెట్టిన ఆయన అతడు, పోకిరి, దూకుడు సినిమాలో ఫుల్ యాక్షన్ చూపించి అదరగొట్టాడు.

కామెడీKhalejaస్టార్ హీరోగా ఎదిగిన తర్వాత సినిమా మొత్తం నవ్వించే బాధ్యతలు తీసుకోవడం ఛాలెంజింగ్ విషయం. ఆ ఛాలెంజ్ ని తీసుకొని ఖలేజా సినిమాలో మహేష్ తనలోని కామెడీ టైమింగ్ ని బయట పెట్టారు.

డ్రామాSeetamma Vakitlo Sirimallechettuతెలుగు ప్రజలకు ఇష్టమైంది డ్రామా. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు ఈ జాన్రా మూవీల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. అక్కాతమ్ముడు మధ్య అనుబంధాన్ని అర్జున్ సినిమాలో, అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో చూపించారు. రీసెంట్ గా బ్రహ్మోత్సంలో ఉమ్మడి కుటుంబం యొక్క గొప్పతన్నాని చాటారు.

సైన్స్ ఫిక్షన్ Naniహాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ సినిమాలు హిట్ సాధిస్తాయి. ఇక్కడ చాలా కష్టం. అయినా సైన్స్ ఫిక్షన్ తో నాని సినిమా చేశారు. రెండు షేడ్స్ లో చక్కగా నటించారు.

సైకలాజికల్ థ్రిల్లర్ Nenokkadineతెలుగు సినీ ప్రేక్షకులకు సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీని పరిచయం చేసిన రికార్డు మహేష్ ఖాతాలో ఉంది. వన్ నేనొక్కడినే సినిమాతో పూర్తి సైకలాజికల్ థ్రిల్లర్ ను మనకందించారు.

మెసేజ్ ఓరియెంటెడ్ Srimanthuduకమర్షియల్ కథలు వేరు, మెసేజ్ ఓరియెంటెడ్ కథలు వేరు. కమర్షియల్ వే లో మహేష్ మెసేజ్ ని అందించారు. శ్రీమంతుడు సినిమా ద్వారా సొంత ఊరి అభివృద్ధికి పాటుపడాలని సందేశాన్ని ఇచ్చారు.

డిటెక్టివ్ స్టోరీ Spyderజేమ్స్ బ్యాండ్ తరహా స్టోరీతో అప్పట్లో కృష్ణ సినిమాలు చేశారు. ఆ తర్వాత కొంతమంది మన స్టార్స్ అటువంటి కథల్లో నటించారు. మహేష్ బాబు తొలిసారి డిటెక్టివ్ స్టోరీ తో స్పైడర్ మూవీ చేస్తున్నారు. ఇందులో ఇంటెలిజన్స్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

పొలిటికల్ Bharat Anu Nenuస్పైడర్ తర్వాత మహేష్ మరో వైవిధ్య కథను ఎంచుకున్నారు. తాను ఇంతవరకు టచ్ చేయని పొలిటికల్ స్టోరీ తో భరత్ అను నేను సినిమా చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మహేష్ లోని మరో కోణాన్ని బయటపెట్టనుంది.

Share.