స్పైడర్ టీజర్ ఇచ్చిన సమాధానాలు.. వేసిన ప్రశ్నలు

సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన స్పైడర్ టీజర్ ఈరోజు విడుదలై సంచలనం సృష్టిస్తోంది. 70 సెకన్ల ఈ వీడియోలో మహేష్ స్టైలిష్ యాక్టింగ్.. ఎస్.జె. సూర్య విలక్షణ విలనిజం స్పష్టంగా కనిపిస్తోంది. సంతోష్ శివన్ కెమెరా పనితనానికి హరీష్ జయరాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తోడై టీజర్ కి ఎక్కువ మార్కులు పడేలా చేశాయి. అయితే ఈ టీజర్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు అర్ధమవుతాయి. వాటిపై స్పెషల్ ఫోకస్…

ఫ్లై ఓవర్ పై మహేష్ 1-spyder-teaserఫ్లై ఓవర్ వద్ద జనాలు గుమిగూడి ఉన్న షాట్ లో ఆ ఫ్లై ఓవర్ పైన మహేష్ నిలబడి ఉన్నారు. అతని పక్కన మరో వ్యక్తి కూడా నిలబడి ఉన్నారు. అక్కడి నుంచి ఆఫీసర్ స్పై చేస్తున్నట్లు అనిపిస్తోంది.

బైక్ పై సితార 2-spyder-teaserమహేష్ ఫార్మల్ వేర్ లో రౌడీలను ఉతికి ఆరేస్తున్న షాట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ప్రదేశంలో బైక్ పైన ఓ పాప కూర్చొని ఉంది. ఆమె మహేష్ బాబు కూతురు సితార అని అందరూ అనుకుంటున్నారు.

చిన్నారుల రక్షకుడు 3-spyder-teaserఈ టీజర్ లో మరో ఫైట్ సీన్ ఉంది. ఒక బాబుతో నడిచి వస్తుంటారు. ఈ సినిమాలో కొంతమంది చేతుల్లో బందీలుగా ఉన్న బాల కార్మికులను స్పైడర్ విడిపిస్తాడు.

రకుల్ స్టూడెంట్ 4-spyder-teaserబ్లైండ్ డేట్ కి ఇష్టపడే అమ్మాయిగా రకుల్ ని టీజర్ లో పరిచయం చేశారు. అయితే ఆమె ఉన్న పరిసరాలను గమిస్తే స్టూడెంట్ అని, తనగదిని ఎంతో అందంగా అలంకరించుకునే అమ్మాయిగా కనిపిస్తోంది.

కారులో ఆమె ఎవరు? 5-spyder-teaserమహేష్ రెడ్ కార్ ని చాలా వేగంగా నడుపుతుంటారు. అందులో డ్రైవర్ పక్క సీట్ లో ఓ అమ్మాయి ముసుగు వేసుకొని కూర్చొని ఉంటుంది. ఆమె రకులా? ఇంకెవరైనాన?

“హెల్ప్” అడిగితే చాలు 6-spyder-teaserసిటీలో ఎక్కడ హెల్ప్ అని అరిస్తే చాలు అక్కడికి వాలిపోయే దూకుడు గల ఇంటెలిజెన్స్ ఆఫీసర్ లా స్పైడర్ కనిపిస్తున్నారు. సిస్టం ముందు కూర్చొని ట్రాకింగ్ సాఫ్ట్ వేర్ ని చూస్తున్న మహేష్ .. షాట్ ని జాగ్రత్తగా గమనిస్తే కంప్యూటర్ స్క్రీన్ పై హెల్ప్ అనే పదం కనిపిస్తుంది.

ప్రియదర్శి న్యూ లుక్ 7-spyder-teaserపెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి స్పైడర్ మూవీలో నటించారు. అయితే ఇందులో చాలా డీసెంట్ గా ఉన్నట్లు అతని లుక్ చెబుతోంది.

స్పైడర్ లో శ్రీమంతుడు 8-spyder-teaserమహేష్ శ్రీమంతుడు సినిమాలో సైకిల్ తొక్కి సక్సస్ అందుకున్నాడు. అదే సీన్ స్పైడర్ లోను ఉంది. ఈ సారి ఒక్కడే కాకుండా వెనుక సీట్లో ఎవరినో ఎక్కించుకొని మరీ తొక్కుతున్నాడు.

భరత్.. ఓ రిస్కీ ఫైట్ 9-spyder-teaserయువ నటుడు భరత్ స్పైడర్ లో కీలక రోల్ పోషించారు. మహేష్ తో భరత్ తలపడనున్నారు. వారిద్దరి మధ్య ఉండే ఫైట్.. ఒళ్ళు గగుర్పొడుస్తుందనడానికి సింపుల్ గా ఒక షాట్ లో చూపించారు. రోలర్ కోస్టర్ పై మహేష్, భరత్ పై రిస్కీ ఫైట్ హైలెట్ కానుంది.

Share.