సాయి పల్లవి గురించి మీకు తెలియని సంగతులు

కొన్ని పాత్రలు కలకాలం నిలిచి పోతాయి .. అటువంటి పాత్రల్లో ఫిదా మూవీలో భానుమతి ఒకటి. ఈ పాత్రలో సాయి పల్లవి అద్భుతంగా నటించి తెలుగు చిత్రపరిశ్రమలో ఒక గుర్తింపును సంపాదించుకుంది. ఒకే ఒక చిత్రంతో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కి గట్టిపోటీ ఇచ్చింది. దాంతో ఈ ముద్దుగుమ్మ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అందుకోసమే ఈ ఫోకస్…

01 . పుట్టింది..పెరిగింది Sai Pallaviసాయి పల్లవి పుట్టింది..పెరిగింది తమిళనాడు రాష్ట్రంలోనే. అయితే పుట్టింది కోటగిరిలో అయితే .. పెరిగింది మాత్రం కోయంబత్తూర్లో.

02. డాక్టర్ సాయి పల్లవిSai Pallaviసాయి పల్లవి హీరోయిన్ మాత్రమే కాదు డాక్టర్ కూడా. ఆమె జార్జియా యూనివర్సిటీ నుంచి డాక్టర్ డిగ్రీ పూర్తి చేశారు. సాయి పల్లవికి నటన కంటే వైద్య విద్యే ముఖ్యం. అందుకోసమే స్టార్ హీరోల ఛాన్స్ లు వదులుకుంది.

03 . ఐశ్వర్య శిష్యురాలు Sai Pallaviసాయి పల్లవి మలయాళం ప్రేమమ్ సినిమాలో డ్యాన్స్ తో అదరగొట్టింది. ఆమె ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. ఐశ్వర్యారాయ్, మాధురి దీక్షిత్ డ్యాన్స్ వీడియోలను చూసి నేర్చుకుంది..

04 . ఓనం ఇష్టం Sai Pallaviకేరళలో పుట్టకపోయినా, కేరళ వాసుల పెద్ద పండుగ ఓనం అంటే సాయి పల్లవికి చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ముగ్గులు వేయడం నేర్చుకుంది..

05 . కార్డియాలజిస్ట్Sai Pallaviసాయి పల్లవికి అతి పెద్ద గోల్ కార్డియాలజిస్ట్ కావడం. అందుకోసం చాలా కష్టపడుతోంది. సినిమాలను కొన్ని మాత్రమే ఎంచుకొని స్టడీపై దృష్టిపెడుతోంది..

06. సపోర్టింగ్ ఆర్టిస్ట్ Sai Pallaviప్రేమమ్ సినిమాలో హీరోయిన్ గా పరిచయం కాకముందు చిన్న పాత్ర చేసింది. తమిళ చిత్రం ధామ్ ధూమ్ లో కంగనా రనౌత్ కి స్నేహితురాలిగా నటించింది..

07. డ్యాన్స్ షోSai Pallaviఈటీవీ వారు నిర్వహించే డ్యాన్స్ షో ఢీ 4 లో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ వేసి ప్రసంశలు అందుకుంది. ఇప్పటికీ ఆ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువ లైక్స్ అందుకుంటోంది..

08 . అల్ఫోన్స్ పుతరన్ Sai Pallaviసాయి పల్లవి హీరోయిన్ కాకముందు వాణిజ్య ప్రకటనలు చేసేది. అందులో ఆమెను చూసిన అల్ఫోన్స్ పుతరన్ ( మలయాళం ప్రేమమ్ డైరక్టర్ ) యాడ్స్ ఆపేయమని గట్టిగా చెప్పాడు. హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు..

09 . డైరక్టర్స్ ఇచ్చిన దైర్యంSai Pallaviతన స్కిన్ టోన్ బాగుండదని సాయి పల్లవి కొంత బెరుకుగా ఉంటుంది. కానీ డైరక్టర్స్ ఇచ్చిన ధైర్యంతోనే పూర్తి ఆత్మవిశ్వాసంతో కెమెరా ముందుకు వస్తానని ఆమె ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది..

10 . మిస్ అండర్ స్టాండ్ Sai Pallaviసాధారణ అమ్మాయిల్లాగే అల్ఫోన్స్ పుతరన్ ఫోన్ చేస్తుంటే .. ఎవరో అబ్బాయి ప్రపోజ్ చేయడానికి వెంటపడుతున్నాడని అతన్ని ఇగ్నోర్ చేసిందంట. తర్వాత తన డేట్స్ కోసం అని తెలుసుకొని బాధపడింది.

సాయి పల్లవి సినీ కెరీర్ గురించి తెలుసుకుంటుంటే ఆమెపై మరింత ఇష్టం కలుగుతుంది కదూ. దట్ ఈజ్ సాయి పల్లవి.

Share.