అజ్ఞాతవాసి గురించి మీకు తెలియని 4 రహస్యాలు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందిన మూడో చిత్రం “అజ్ఞాతవాసి”. అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ప్రారంభం నుంచి క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచింది. ఈ మూవీ టీజర్, పాటలు యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. జనవరి 10 న రిలీజ్ కానున్న ఈ మూవీ గురించి కొన్ని రహస్యాలు బయటికి వచ్చాయి.. అవి ఏమిటంటే..

కథ వినకుండా.. Agnyaathavaasiప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఈ సినిమా కథ వినకుండానే ఓకే చెప్పారు. కారణం పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌. వీరి ముగ్గురు కలిసి అత్తారింటికి సినిమా చేసిన సంగతి తెలిసిందే.

బాహుబలి రికార్డ్స్ బ్రేక్ Agnyaathavaasiబాహుబలి కంక్లూజన్ రికార్డులను అజ్ఞాతవాసి రిలీజ్ కాకముందే బద్దలు కొట్టింది. నార్త్ అమెరికాలో బాహుబలి 2 అన్ని భాషలు కలుపుకొని 462 స్క్రీన్స్ లో రిలీజ్ అయితే.. అజ్ఞాతవాసి మాత్రం 500 స్క్రీన్స్ లో రిలీజ్ అవుతోంది.

5 కోట్ల సెట్Agnyaathavaasiఅజ్ఞాతవాసి కోసం అన్నపూర్ణ స్టూడియోలో 5 కోట్లతో సాఫ్ట్ వేర్ కంపెనీ సెట్ వేశారు. అక్కడే ఎక్కువగా భాగం షూట్ చేశారు. మిగిలిన పాటలు, ఫైట్లు యూరోప్, వారణాసిలో తీశారు.

సొంతంగా డబ్బింగ్ Agnyaathavaasiఅజ్ఞాతవాసిలో హీరోయిన్స్ గా నటించిన అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు.

ఇలాంటి విశేషాలు అజ్ఞాతవాసిలో ఇంకా ఎన్నో ఉన్నాయి. ఆ సంగతులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాము.

Share.