టాప్ 10 క్రేజీ మ్యూజిక్ కాంబినేషన్స్

అప్పట్లో…అంటే అదే రాజుల కాలంలో ఆస్థాన విద్వాంసులు ఉండే వారు అని మనం విన్నాం…ఇంకా చెప్పాలి అంటే చాలా సినిమాల్లో చూశాం కూడా…అయితే అదే క్రమంలో ఈ కాలం తీసుకుంటే ముఖ్యంగా మన సినిమా పరిశ్రమ విషయమే తీసుకోండి, సినిమా హిట్ కావడానికి కధం కధనం, యాక్టింగ్ తో పాటు ఎన్నో సార్లు మ్యూజిక్ కూడా తొడవుతుంది. ఇంకా చెప్పాలి అంటే కొన్ని సినిమాలు హిట్ కావడానికి కేవలం మ్యూజిక్కె కారణం అంటే అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే సెంటిమెంట్స్ ను బాగా ఫాలో అయ్యే మన తెలుగు సినిమా వాళ్ళు, ఒక హిట్ పడగానే అదే కాంబినేషన్ కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు…అలా సెట్ అయ్యి సూపర్ హిట్ అయిన హీరో-మరియు మ్యూజిక్ డైరెక్టర్ టాప్ టెన్ లిస్ట్ పై ఒక లుక్ వేద్దాం రండి…

1. అల్లు అర్జున్ – దేవిశ్రీప్రసాద్Allu Arjun, Devi Sri Prasadస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాను చేసే డ్యాన్స్ స్టెప్స్ కి సరైన బీట్స్ పడితే దుమ్ము రేగిపోవాల్సిందే…అయితే అదే క్రమంలో యువత గుండెలను టచ్ చేసేలా ఎప్పటికప్పుడు సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చే దేవి శ్రీ ప్రసాద్, బన్నీ కాంబినేషన్ లో సూపర్ హిట్స్ వచ్చాయి. ఇనాక్ చెప్పాలి అంటే దాదాపుగా వీళ్ళిద్దరి కాంబినేషన్ అంటే మ్యూజికల్ హిట్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్య- ఆర్య2 సాంగ్స్ ఇప్పటికీ చాలా మంది స్రోతలకు ఇష్టమైన పాటలుగా చలామణి అవుతున్నాయి.

2. బాలకృష్ణ – మణిశర్మBalakrishna, Mani Sharmaనందమూరి నట సింహం బాలకృష్ణ రేంజ్ కి తగ్గ మ్యూజిక్ ఇవ్వాలి అంటే మెలొడీ బ్రహ్మ మణిశర్మకే సాధ్యం అని చెప్పాలి. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టెర్స్ గా మారాయి. ఇక చెన్నకేశవరెడ్డి సినిమాకి మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే విన్నప్పుడల్లా ఇప్పటికీ సగటు తెలుగు ప్రేక్షకుడికి రోమాలూ నిక్క పొడిచేలా చేస్తుంది.

3. చిరంజీవి – రాజ్ కోటిChiranjeevi, Kotiమెగాస్టార్ తెలుగు తెరపై వేసిన చిందులు ఇప్పటికీ ఆయన అభిమానులు మరచిపోలేరు. డ్యాన్స్ అంటే మెగాస్టార్…మెగాస్టార్ అంటే డ్యాన్స్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మెగాస్టార్ డ్యాన్స్ కి రాజ్ కోటి ట్యూన్స్ పడితే సినిమా సూపర్ హిట్ అయ్యేది. అలా ఎన్నో సినిమాలు మెగాస్టార్-రాజ్ కోటి కాంబినేషన్ లో టాలీవుడ్ హిట్స్ గా నిలిచాయి.

4. వెంకటేష్ – కీరవాణిVenkatesh, keeravaniవిక్టరీ వెంకటేష్- ఎం ఎం కీరవాణి కాంబినేషన్ అంటేనే మెలొడీ సాంగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ అనే చెప్పాలి. వెంకీ సినిమాలకు ఎన్నో హిట్స్ అందించిన మ్యూజిక్ దర్శకుల్లో కీరవాణి ముఖ్యుడు అనే చెప్పాలి. మొత్తంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ హిట్ మ్యూజిక్ కాంబినేషన్ గా సూపర్ హిట్ సినిమాలను అందించాయి.

5. పవన్ – రమణ గోగులPawan, Ramana Gogulaపవర్ స్టార్ పవన్ కల్యాణ్…ఈ పేరే ఒక ప్రభంజనం…అయితే కరియర్ తొలి నాళ్ళలో పవన్ మంచి హిట్ కోసం ఎదురు చూస్ సమయంలో రమణ గోగుల అందించిన తమ్ముడు సినిమా ఇప్పటికీ ఎవ్వరూ మరచిపోరు, అందులో ముఖ్యంగా ‘లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ థ మిర్రిర్’ అనే పాట ఇప్పటికీ అభిమానులకు మంచి ఊపుని అందిస్తుంది. మొత్తంగా చూసుకుంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఫ్యాన్స్ కు మంచి అనుభూతిని మిగిల్చాయి అనే చెప్పాలి.

6. ఉదయ్ కిరణ్ – ఆర్పీ పట్నాయక్Udai Kiran, R.P.Patnaikటాలీవుడ్ ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ మ్యానియాతో ఊగిపోయిన కాలంలో, ఆర్పీ ఉదయ్ కాంబినేషన్ ఒక పెను సంచలనం. ఈ చెప్పాలి అంటే వీలిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచి ప్రేక్షకులకు సంగీత మాధుర్యాన్ని రుచి చూపించాయి.

7. రవి తేజ – థమన్Ravi teja, Thamanసూపర్ హిట్స్ తో దూసుకుపోతున్న క్రమంలో రవి తేజ కు మంచి కిక్ ఇచ్చే మ్యూజిక్ అందించాడు థమన్. ఇక ఈ సినిమాతో మొదలయిన ఈ కిక్ మరిన్ని సినిమాలకు పాకి మంచి హిట్ మ్యూజిక్ కాంబినేషన్ గా ఏర్పడి సూపర్ హిట్ పాటలకు అధ్యం పోసాయి.

8. నితిన్ – అనూప్ రూబెన్స్Nithin, Anup Rubensవరుస ఫ్లాప్స్ తో మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ కి వరుస హిట్ వచ్చిన క్రమంలో ఆ సినిమాలకు ప్రాణంగా నిలిచింది ఆ సినిమా మ్యూజిక్. ఇక ఈ క్రమంలో వీలిద్దరి కాంబినేషన్ మరిన్ని హిట్ సినిమాలు ప్రాణం పోసి, అటు నితిన్ కి హిట్ మాత్రమే కాకుండా ఇటు అనూప్ కి మంచి బ్రేక్ ను ఇచ్చింది అనే చెప్పాలి.

9. విశాల్ – యువన్ శంకర్ రాజాVishal, Yuvan Shankar Rajaతమిళ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న విశాల్…యువాన్ శంకర్ రాజా కాంబినేషన్ తమిళ సినిమాకే పెను సంచలనం. ఈ ఇద్దరు కాంబినేషన్స్ లో వచ్చిన సినిమాలు మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచాయి.

10. మంచు మనోజ్ – అచ్చుManchu Manoj, Achuహీరోగా మంచి బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న మనోజ్ కి అచ్చు మ్యూజిక్ అందించిన సినిమాలు మంచి హిట్స్ గా నిలిచి సూపర్ గుడ్ కాంబినేషన్ కు అధ్యం పోసాయి.

ఇలా మొత్తంగా హీరో-మ్యూజిక్ డైరెక్టర్ హిట్ కాంబినేషన్ తెలుగు చిత్ర పరిశ్రమలో సంగీత సంచలనాలకు ప్రాణం పోసింది.

Share.