మహేష్ స్పైడర్ కి రేపే ఆఖరి రోజు

మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కొంతకాలంగా క్లైమాక్స్ చిత్రీకరణ హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ క్వార్టర్స్, రామోజీ ఫిలిం సిటీ, నిమ్స్ హాస్పిటల్ ప్రాంతాల్లో జరిగింది. నిమ్స్ లో కొన్ని రాజకీయ కారణాల వల్ల షూటింగ్ కి అంతరాయం కలగడంతో మురుగదాస్ బృందం చెన్నైకి షిఫ్ట్ అయింది. అక్కడ పెద్ద హాస్పిటల్లో క్లైమాక్స్ ని మూడు రోజులుగా తెరకెక్కిస్తున్నారు. రేపటితో ఈ ఫైట్ పూర్తి అవుతుందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిని రేపటి వర్క్ పరిమిషన్ తీసుకున్నారని వెల్లడించాయి. స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడంతో రేపు సాయంత్రం మహేష్ హైదరాబాద్ కి రానున్నారు.

ఆదివారం రెస్ట్ తీసుకొని సోమవారం నుంచి కొరటాల శివ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. శ్రీమంతుడు తర్వాత ఈ కాంబోలో వస్తున్న సినిమాకి “భరత్ అను నేను” అని పేరుని ఖరారు చేశారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్లో మొదలయి ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.