అంధుడి పాత్రల్లో అదరగొట్టిన హీరోస్

సినిమాలో హీరో అంటే అందగాడు అయి ఉండాలి. అన్నిటిలో ఆరితేరి ఉండాలి. మరి అలాకాకుండా అంధుడు అయితే.. ఆలోచించాల్సిందే. ఆ హీరో అభిమానులు ఒప్పుకుంటారా? డిస్ట్రిబ్యూటర్స్ సినిమా కొనడానికి ముందుకు వస్తారా? .. సినిమాకి కలక్షన్స్ వస్తాయా?… ఈ అనుమానాలన్నిటినీ మన స్టార్ హీరోస్ పటాపంచలు చేశారు. అంధుడిగా నటించి అదరహో అనిపించారు.

ఎన్టీఆర్ (చిరంజీవులు) Chiranjeevuluమహానటుడు నందమూరి తారకరామారావు చిరంజీవులు చిత్రం కోసం సాహసం చేశారు. అంధుడి పాత్ర పోషించారు. అయినా ఎన్టీఆర్ తన నటనతో ప్రేక్షుకులను మెస్మరైజ్ చేశారు.

కమలహాసన్ (అమావాస్య చంద్రుడు )Amavasya Chandruduవిశ్వనటుడు కమలహాసన్ పోషించని రోల్ అంటూ లేదు. అన్నిటి లాగే అంధుడిగాను ఔరా అనిపించారు. అమావాస్య చంద్రుడు సినిమాలో బ్లైండ్ మ్యాన్ గా మెప్పించారు.

సర్వదమన్ బెనర్జీ (సిరివెన్నెల)Sirivennelaకళాతపస్వి విశ్వనాధ్ తెరకెక్కించిన సిరివెన్నెల చిత్రంలో హీరో అంధుడు. ఆ పాత్రను సర్వదమన్ బెనర్జీ చక్కగా పోషించి చిత్రాన్ని విజయవంతం చేశారు.

శివాజీరాజా (కళ్ళు) Kalluక్యారెక్టర్ ఆర్టిస్ట్ శివాజీ రాజా కళ్ళు సినిమాలో అంధుడిగా అద్భుత నటన ప్రదర్శించారు. ఈ మూవీ ఆర్ధికంగా సక్సస్ కానప్పటికీ.. శివాజీ రాజాకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఆర్ పీ పట్నాయక్ (శీను వాసంతి లక్ష్మి ) Seenu Vasanthi Lakshmiసంగీత దర్శకుడు ఆర్ పీ పట్నాయక్ చూపులేనివాడిగా శీను వాసంతి లక్ష్మి సినిమాలో సూపర్ గా నటించారు. అందరితో కన్నీరు పెట్టించారు.

సిద్ధార్ధ్ (అనగనగా ఒక ధీరుడు) Anaganaga O Dheeruduలవర్ బాయ్ సిద్ధార్ధ్ గుడ్డివాడిగా నటించిన చిత్రం అనగనగా ఒక ధీరుడు. కె.రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ తెరకెక్కించిన ఈ జానపదచిత్రం చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంది.

రాజ్ తరుణ్ (అంధగాడు)Andhagaduయువ హీరో రాజ్ తరుణ్ అంధగాడు చిత్రంలో అంధుడిగా నటించారు. అయితే ఇందులో రాజ్ తరుణ్ కి కళ్ళు వస్తాయి. అయినప్పటికీ అంధుడిగా ఉన్నప్పుడు తన నటనతో నవ్వులు పూయించారు.

రవితేజ (రాజా ది గ్రేట్) Raja The Greatమాస్ మహారాజ్ రవితేజ అంధుడిగా నటించిన సినిమా రాజా ది గ్రేట్. అనిల్ రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రవితేజ ఫుల్ జోష్ తో నటించి సూపర్ హిట్ చేశారు.

Share.