పొలిటీషియన్స్ గా అలరించిన సినీ నటులు

సినీ రంగం వేరు.. రాజకీయ రంగం వేరు. నటుడిగా రాణించి, రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ చేసిన వారున్నారు. అలాగే సినిమాల్లో లీడర్ గా నటించి మెప్పించిన వారున్నారు. వెండితెరపై రాజకీయనాయకుడిగా అలరించిన వారిపై ఫోకస్..

1. అర్జున్ (ఒకే ఒక్కడు)01సమాజంలోని సమస్యలనే కథాంశంగా తీసుకొని సినిమాలు తెరకెక్కించే శంకర్ ఒక రోజు సీఎం ఎలా ఉంటారో అర్జున్ రూపంలో ఒకే ఒక్కడు సినిమాలో చూపించారు.

2. చిరంజీవి (ముఠా మేస్త్రి)02చిరంజీవి నిజజీవితంలో కేంద్ర మంత్రిగా చేశారు. అంతకంటే ఇరవై ఏళ్ల క్రితమే ముఠా మేస్త్రి సినిమాలో రాష్ట్ర మంత్రిగా అదరగొట్టారు.

3. శ్రియ శరన్ (పవిత్ర)03ఒక వేశ్య రాజకీయంలోకి అడుగు పెడితే ఎటువంటి మార్పు సంభవిస్తుందనే విషయాన్నీ పవిత్ర మూవీలో చూపించారు. ఈ సినిమాలో శిశు, మహిళా సంక్షేమ మంత్రిగా శ్రియ శరన్ చక్కగా నటించారు.

4. రానా దగ్గుబాటి (లీడర్ / నేనే రాజు నేనే మంత్రి)04రానా ఎంట్రీ సినిమాతోనే సీఎం గా కనిపించారు. లీడర్ లో యంగ్ సీఎంగా ఆకట్టుకున్నారు. మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ మూవీ “నేనే రాజు నేనే మంత్రి”లో లీడర్ గా మెప్పించారు.

5. విజయశాంతి (ఆశయం)05లేడీ అమితాబ్ బచ్చన్ విజయ శాంతి అనేక పవర్ ఫుల్ రోల్స్ పోషించి అభినందనలు అందుకుంది. అలాగే ఆశయం సినిమాలో రాజకీయ నాయకురాలిగా శెభాష్ అనిపించుకుంది.

6. మహేష్ బాబు (దూకుడు / భరత్ అనే నేను) 06సినిమానే నటన.. అందులో నటించడం అంటే దూకుడు సినిమాలో మహేష్ ని చూస్తే తెలుస్తుంది. ఇందులో తండ్రి కోసం కాసేపు మహేష్ ఎమ్మెల్యే గా నటించారు. ఇప్పుడు భరత్ అనే నేను సినిమాలో పక్కా రాజకీయ నాయకుడిని చూడనున్నాం.

7. సాయి కుమార్ (ప్రస్థానం)07రాజకీయనాయకుడిలోని భావోద్వేగాలను సాయి కుమార్ ప్రస్థానం సినిమాలో బాగా పలికించారు. దీంతో సాయి కుమార్ ఏ పాత్రకైనా ప్రాణం పోస్తారని నిరూపించారు.

8. శ్రీకాంత్ (ఆపరేషన్ దుర్యోధన)08ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ డిఫెరెంట్ గా ట్రై చేసిన సినిమా ఆపరేషన్ దుర్యోధన. ఇందులో ప్రజలతో ఓపెన్ గా మాట్లాడే ఎమ్మెల్యే గా శ్రీకాంత్ భలే నటించారు.

9. రాజశేఖర్ (ఎవడైతే నాకేంటి)09పోలీస్ పాత్రల్లో పవర్ ఫుల్ గా నటించే రాజశేఖర్ .. అంతే పవర్ ఫుల్ గా పొలిటీషియన్ రోల్ లోను కనిపించారు. ఎవడైతే నాకేంటి సినిమాలో హోం మినిస్టర్ గా రాజశేఖర్ నటనను మరిచిపోలేరు.

10. మోహన్ బాబు (అసెంబ్లీ రౌడీ)10డైలాగ్ కింగ్ మోహన్ బాబు కెరీర్ ని మలుపు తిప్పిన చిత్రం అసెంబ్లీ రౌడీ. ఇందులో మోహన్ బాబు తనదైన స్టైల్ ల్లో నాయకుడిగా అలరించారు.

11. ఎన్టీఆర్ (జై లవకుశ)11ఎన్టీఆర్ తొలి సారి త్రి పాత్రాభినయం పోషిస్తున్న జై లవకుశ సినిమాలో ఒక క్యారెక్టర్ పొలిటిషన్ అని సమాచారం. అది నిజమో కాదో తెలియాలంటే… మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Share.