పెళ్లి ఊసెత్తని దక్షిణాది హీరోయిన్స్

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని చెబుతుంటారు పెద్దలు. అలాంటి ముచ్చటలో పెళ్లి ఒకటి. అమ్మాయికైనా, అబ్బాయికైనా పాతికేళ్ళు నిండగానే “పెళ్లి ఎప్పుడు?” అనే ప్రశ్న ఎదురవుతుంది. మరి దక్షిణాది చిత్రపరిశ్రమలో ముప్పైయేళ్లు నిండినా పెళ్లి మాట ఎత్తని తారలున్నారు. అటువంటి వారిపై ఫోకస్..

శ్రియ Shriyaపదహారు సంవత్సరాల పాటు హీరోయిన్ గా కొనసాగడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ శ్రియ శరణ్ 2001 నుంచి మొన్న విడుదల యినా గౌతమి పుత్ర శాతకర్ణి వరకు కథానాయికగా నటిస్తోంది. 34 ఏళ్ళ ఈ భామ.. ఇప్పుడు కూడా కెరీర్ గురించి ఆలోచిస్తుంది తప్ప.. పెళ్లి మాట ఎత్తకపోవడం విశేషం.

కాజల్ అగర్వాల్ Kajal Aggarwalశ్రియ శరణ్ తర్వాత ఎక్కువ ఏళ్ళు సినీ కెరీర్ కలిగిన నటి కాజల్ అగర్వాల్. టాలీవుడ్ యువరాణిగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ తమిళంలోనూ సినిమాలను చేస్తూ బిజీగా ఉంది. తన చెల్లెలు అతిధి అగర్వాల్ కి దగ్గరుండి పెళ్లి చేసింది కానీ ఈమె మాత్రం పెళ్లి పీటలు ఎక్కలేదు. ఎప్పుడు కళ్యాణం చేసుకుంటుందో చెప్పడం లేదు కానీ.. పెద్దలు కుదిర్చిన సంబంధమే చేసుకుంటానని మాత్రం కాజల్ స్పష్టం చేసింది.

ఛార్మి Charmiమహా మహా.. అంటూ స్టెప్పులతో యువతకి నిద్రలేకుండా చేసిన పంజాబీ భామ ఛార్మికి పాతికేళ్లు నిండాయి. ఇప్పుడు ఆమె చేతిలో సినిమాలు కూడా ఏమీలేవు. అయినా పెళ్లి ఎప్పుడని అడిగితే.. “నేను స్వతంత్రంగా జీవించాలి అందుకే నా కెరీర్ పై దృష్టి పెట్టాను. ఇప్పుడే పెళ్లిచేసుకోను” అని వివరించింది.

హన్సిక మోత్వానీ Hansika Motwaniదేశముదురు ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు సాధించుకుంది. తమిళ హీరో శింబు ప్రేమలో ఉన్న ఈ భామ కూడా మరో ఐదేళ్లవరకు పెళ్లిపీటలు ఎక్కే ఆలోచన లేదని రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. పైగా “నాకింకా ఇరవై రెండేళ్లే … ఇప్పుడే పెళ్లేంటి” అని ఎదురు ప్రశ్నిస్తోంది.

తమన్నా Tamannaమిల్కీ బ్యూటీ తమన్నా దక్షిణాది సినిమాలతో పాటు, బాలీవుడ్ లోని తన సత్తా చాటుకుంది. అనేక విజయాలను సొంతం చేసుకొని బిజీగా ఉన్న ఈ భామని ఇల్లాలిగా ఎప్పుడు మారుతారు అంటే.. గట్టిగా ఓ నవ్వు నవ్వి .. ” మీ కంటికి నేను వయసు అయిపోయిన దానిలా కనిపిస్తున్నానా.. ఏంటి.. పెళ్లి గురించి అడుగుతున్నారు” అని బుంగమూతి పెడుతోంది. కనీసం ఇంకా ఎన్నేళ్లు పడుతుందో ఏదైనా చెప్పమంటే… ఆ ఆలోచన నా మైండ్ లోకి ఇప్పుడే రానివ్వను అంటోంది.

అనుష్క Anushkaఅతి తక్కువకాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్న నటి అనుష్క. దక్షిణాది హీరోయిన్స్ లో ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునే స్వీటీ పెళ్లి వచ్చే ఏడాదే అంటూ ప్రతి సంవత్సరం వార్తల్లో రావడమే కానీ.. నిజమైంది లేదు. ప్రస్తుతం అనుష్క బాగమతి అనే సినిమా చేస్తోంది. దీని తర్వాత పెళ్లేనని చెబుతున్నారు.. మరి ఈ ఏడాది కూడా ఆమె వివాహం జరుగుతుందో లేదో చూడాలి.

Share.