నలభై ఏళ్లు వచ్చినా అందం తగ్గని నటులు

సినిమా రంగంలో ఉన్న నటీనటులు మనుషులే. అందంగా పుట్టినా, అందంగా తయారైనా పెరుగుతున్న వయసుకి తలవంచక తప్పదు. వయసుతో పాటు వచ్చే మార్పులను ఆహ్వానించాల్సిందే. అయితే తెలుగులో కొంతమంది స్టార్స్ కి నలభై ఏళ్ళు మీదపడినా అందం మాత్రం తగ్గలేదు. తల్లి దండ్రులు, అభిమానుల ఆశీర్వాదమో.. వారి తీసుకునే జాగ్రత్తలో.. తెలియదు గానీ నవ యువకుల్లా
మెరిసిపోతున్నారు. అలా అందంతో నేటి హీరోలకు పోటీ ఇస్తున్న స్టార్ హీరోలు ….

చిరంజీవి Chiranjeeviమెగాస్టార్ చిరంజీవి వయసు 62 ఏళ్లు. రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు గ్లామర్ పై ద్రుష్టి పెట్టలేదు. ఆ సమయంలో కొంత వయసు పెరిగినట్టు కనిపించినా, ఖైదీ నంబర్ 150 లో ముప్పైఏళ్ళ వ్యక్తిలా కనిపించి ఆశ్చర్య పరిచారు.

నాగార్జున Nagarjunaకింగ్ నాగార్జున కొడుకులు నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ హీరోలుగా టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. వారికి తన సినిమాలతోనే కాకుండా అందంతోను నాగ్ గట్టి పోటీ ఇస్తున్నారు.

వెంకటేష్ Venkateshవిక్టరీ వెంకటేష్ ఎటువంటి పరుగు పందాన్ని ఇష్టపడరు. నచ్చిన కథ ఏదైనా, పాత్ర ఎటువంటిదైనా సంతోషంగా చేస్తారు. బహుశా ఆ ఆనందమే 57 ఏళ్ళు వచ్చినా వెంకీని అందం గా ఉంచుతోంది.

సంపత్ రాజ్ Sampath rajవిలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా ఆకట్టుకుంటున్న సంపత్ రాజ్ తెలుగు వ్యక్తికానప్పటికీ నటనతో తెలుగు వారికి దగ్గరయ్యారు. అతని వయసు 48 ఏళ్లు. అయినా అంత ఏజ్ ఉన్నవారిలా కనిపించరు.

జగపతి బాబు Jagapathi babuఅప్పట్లో మహిళల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరో జగపతి బాబు. బ్యాడ్ బాయ్ పాత్రలు చేస్తున్నప్పటికీ అదే ఫాలోయింగ్ ఉంది. అయితే యువతలోనే క్రేజ్ పెరిగింది. జగ్గూ బాయ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో అదరగొడుతున్నాడు.

శ్రీకాంత్ Srikanthహీరో శ్రీకాంత్ యాభై ఏళ్ళు వచ్చాయి. అయినా పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఎలాఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. కెరీర్ లో ఎత్తుపల్లాలను అడ్డంకులను చూసినా కుంగిపోకుండా పాజిటివ్ థింకింగ్ తో నిలబడ్డారు.

రవితేజ Ravi tejaస్వశక్తితో హీరోగా నిలదొక్కుకున్న నటుడు రవితేజ. వయసు పెరుగుతున్న కొద్ది అతను మాత్రం యాంగ్ గా కనిపిస్తున్నారు. 49 ఏళ్ళు నిండిన రవితేజలో నేటి యువతలో ఉండే హుషారు ఉంది. ఎనర్జీ ఉంది. అందమూ ఉంది.

పవన్ కళ్యాణ్ Pawan kalyanపవన్ కళ్యాణ్ ఎక్కువమందిని ఆకర్షించడంలో అతని నటన, వ్యక్తిత్వానికి మించి అందానికి ఎక్కువ పాయింట్స్ పడతాయి. మిత ఆహారం, ప్రకృతి సహకారంతో 45 ఏళ్ళు నిండినా యువకుడిగా ఆకట్టుకుంటున్నారు.

మహేష్ బాబు Mahesh babuమహేష్ బాబు హీరోగా అడుగుపెట్టి పద్దెనిమిదేళ్ళు అవుతోంది.. అయినా అతన్ని యువ హీరో అనాల్సిందే. ఎందుకంటే అంత హ్యాండ్సమ్ గా ఉంటారు కాబట్టి. 41 ఏళ్ళు నిండినా యువకుడిలా కనిపించడం మహేష్ కి మాత్రమే సాధ్యం.

Share.