భానుడి భగభగల్లో హీరోల యాక్షన్

భాస్కరుడు రోజురోజుకి ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 40 దాటిపోతున్నాయి. వీటిని  టాలీవుడ్ స్టార్స్ పట్టించుకోవడంలేదు. తమ సినిమాపైనే గురి పెడుతున్నారు. మండే ఎండల్లో శ్రమిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా త్రివిక్రమ్ మూవీ కోసంఎండల్లో చమటోడుస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్ లో వీరిద్దరూ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాధారణ పనిగంటలకంటే రెండు గంటలు ఎక్కువగా పనిచేస్తున్నట్లు తెలిసింది. అక్కినేని ప్రిన్స్ అఖిల్ అవుట్ డోర్ షూటింగ్ చేస్తున్నారు. నిన్నటి వరకు మెట్రో రైల్ స్టేషన్లో అఖిల్ పై దర్శకుడు విక్రమ్ కుమార్ కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ఇక సూపర్ స్టార్ మహేష్ స్పైడర్ మూవీని కంప్లీట్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు. హైదరాబాద్ లో నిన్నటి నుంచి స్పైడర్ షెడ్యూల్ మొదలయింది.

రామ్ చరణ్ కూడా కొల్లేరు పరిసర ప్రాంతాల్లో రేపల్లె షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ యువహీరోలతో పాటు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఎండల్లో కష్టపడుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా  హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంత ఎండల్లో కూడా బాలయ్య హుషారుగా షూటింగ్ లో పాల్గొనడం చూసి యూనిట్ సభ్యులందరూ ఆశ్చర్యపోతున్నారు. అభిమానులను అలరించడానికి ఎంతైనా శ్రమిస్తామని ఈ హీరోలు చెప్పకనే చెబుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.